బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించిన కవిత తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని పిటిషన్ లో కోరిన సంగతి తెలిసిందే.అదేవిధంగా మహిళల ఈడీ విచారణపై మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు.
కాగా ఈ పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన ధర్మాసనం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.







