పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పలు క్రేజీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్ నటించిన మరో సినిమా రిలీజ్ కానేలేదు.
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కో సినిమాను జెట్ స్పీడ్ తో పూర్తి చేయాలని చూస్తున్నారు.
ప్రెజెంట్ వినోదయ సీతం రీమేక్ షూట్ ను ఈ రోజుతో ముగించేశాడు.గత కొన్ని రోజులుగా ఈ రీమేక్ సినిమా షూట్ లోనే పాల్గొంటున్న పవన్ తన పార్ట్ షూట్ ను అయితే పూర్తి చేసుకున్నాడు.
ఇక ఈ సినిమా కంటే ఎన్నో ఏళ్ల ముందుగానే స్టార్ట్ చేసిన ”హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu) మాత్రం ఇంకా పూర్తి చేయలేక పోయాడు.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో (Krish Jagarlamudi) తెరకెక్కుతుంది.

కరోనా కంటే ముందుగానే స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇంకా షూట్ ముగించనే లేదు.అయితే వినోదయ సీతం రీమేక్ షూట్ ముగియడంతో నెస్ట్ ఈయన హరీష్ శంకర్( Harish Shankar )తో చేయనున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) షూట్ లో పాల్గొంటాడట.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ అవ్వనుందని తెలుస్తుంది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత అప్పుడు వీరమల్లు షూట్ లో అడుగు పెట్టనున్నట్టు తాజా సమాచారం.

మరి ఈసారైనా పూర్తిగా పూర్తి చేస్తాడో లేదంటే మరో పార్ట్ మాత్రమే పూర్తి చేసి కొత్త సినిమాకు షిఫ్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటిస్తుండగా.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ముగించుకుని రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.







