Ranga Maarthaanda : మంచి సినిమాలు మాత్రమే ఎందుకు సరైన ఆదరణను నోచుకోవడం లేదు ?

సినిమా అంటే వ్యాపారం.అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం.

 Why Good Movies Are Not Working-TeluguStop.com

అందుకే సినిమా తీస్తే ఎన్ని వచ్చాయి, ఎంత పెట్టారు అనే మాటలే తప్ప ఇంత బాగా నటించారు, ఎంత గొప్పగా తీశారు అనే మాటలు వినిపించడం లేదు.కళాత్మకతతో కూడిన సినిమాలు వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోతున్నాయి.

ఒకవేళ వచ్చిన అవి చూడ్డానికి ఇప్పటి యువతకు సమయం చిక్కడం లేదు ఓటీపీ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక ఆ సినిమా ధియేటర్ కి వెళ్లి చూడాల్సిన అవసరం ఎవరికి రావడం లేదు.టికెట్స్ రేట్లు పెడగా పెరగడంతో ఒకసారి థియేటర్ కి వెళ్లాలంటే దాదాపు 2000 రూపాయల ఖర్చు అవుతుండడంతో సామాన్య ప్రజలు థియేటర్ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.

ఇన్ని సమస్యల నడుము మంచి సినిమా చచ్చిపోతుంది.

Telugu Balagam, Dallas, Krishna Vamsi, Prakash Raj, Tollywood-Latest News - Telu

ఇక ఇప్పుడు రెండు మంచి సినిమాలు విడుదలయ్యాయి వాటికి ఎంత కలెక్షన్స్ వచ్చాయి అంటే తెల్ల మొహాలు వేయాల్సిన పరిస్థితి.ఆ రెండు సినిమాలు ఒకటి బలగం మరొకటి రంగ మార్తాండ( Ranga Maarthaanda ).ఈ రెండు సినిమాలకు సామాన్య ప్రేక్షకులు సైతం కదలారు.వారికి మనసుకు నచ్చే సినిమాగా ఈ రెండు చిత్రాలు నిలిచాయి కానీ కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు ఫ్లాప్ చిత్రాలుగానే చెప్పొచ్చు.సినిమా విడుదల చేసాము, బాగా టాక్ వచ్చింది, డబ్బులు బాగా వచ్చాయి అని గొప్పలు చెప్పుకున్నా కూడా వాస్తవంలో అలా ఉండదు.

ఉదాహరణ చెప్పాలంటే బలగం మరియు రంగమార్తాండ( Balagam )సినిమాలు అమెరికాలో ఉన్న డల్లాస్ లో ఒక్క థియేటర్లో కూడా విడుదలకు నోచుకోలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.ఒకటి రెండు తప్ప ప్రధాన థియేటర్స్ లో ఒక్కదాంట్లో కూడా ఈ రెండు చిత్రాలు లేవు.

Telugu Balagam, Dallas, Krishna Vamsi, Prakash Raj, Tollywood-Latest News - Telu

డల్లాస్( Dallas ) అంటేనే తెలుగు వారికి అడ్డ అలాంటి ప్రదేశాల్లోనే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి డబ్బులు పెట్టి సినిమా చూడరు అని డిస్ట్రిబ్యూటర్స్ అనుకున్నారు కాబట్టి సినిమాను విడుదల చేయడానికి అన్ని థియేటర్స్ ని బ్లాక్ చేయలేకపోయారు.పోనీ బలగం విషయంలో దర్శకుడు కొత్తవాడు చిన్న నటులు అనుకున్నప్పటికీ రంగమార్తాండ సినిమాలో ఉద్దండుల వంటి నటులు ఉన్నారు.దేశాన్ని ఉరుతలూగించినటువంటి ఒక సంగీత దర్శకుడు ఉన్నాడు.ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన క్రియేటివ్ దర్శకుడు కూడా ఉన్నాడు.ఆయన కూడా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube