బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు ఫెయిల్ అయితే ఇంటికి వెళ్లాల్సిందే: రవితేజ

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేనటువంటి వారు ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం అని మనకు తెలిసిందే.ఇక సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాస్ మహారాజా రవితేజ (Ravitej a) నేచురల్ స్టార్ నాని వంటి వారు ఒకరు.

 Those-without Background Should Go Home If They Fail Ravi Teja Vikramarkudu, Nan-TeluguStop.com

ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఉన్నప్పటికీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈ ఇద్దరి హీరోలు త్వరలోనే వీరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

నాని నటించిన దసరా( Dasara ) సినిమా ఈ నెల 30 న విడుదల కాగా, రవితేజ నటిస్తున్న రావణాసుర(Ravanasura) సినిమా ఏప్రిల్ 7 వ తేదీ విడుదల కానుంది.

Telugu Dasara, Nani, Ravanasura, Ravi Teja, Tollywood, Vikramarkudu-Movie

ఈ క్రమంలోనే ఈ హీరోలు ఇద్దరు కలసి వారి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.ఇక వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వీరి సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా నాని గురించి రవితేజ మాట్లాడుతూ.

మీ సినిమాలు చూసినప్పుడు నిన్ను చూసినప్పుడు ఇండస్ట్రీకి ఇంకొకడు వచ్చాడు అనిపించింది.ఇక డైరెక్టర్ బాబు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం తనకు మంచి హెల్ప్ అయ్యిందని రవితేజ తెలిపారు.

నాని నటించిన అష్టాచమ్మా సినిమా నుంచి ప్రతి ఒక్క సినిమా కూడా నేను చూస్తున్నాను.రిజల్ట్ తేడా ఉన్న సినిమాలు ఉన్నాయేమో కానీ నాని బాగా చేయలేదనే సినిమా ఇప్పటివరకూ లేదని రవితేజ తెలిపారు.

Telugu Dasara, Nani, Ravanasura, Ravi Teja, Tollywood, Vikramarkudu-Movie

ఇక రవితేజ మాట్లాడుతూ సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి వెళ్లి పోవాలి అనే భయం తనలో చాలా ఉంది.అయితే ఆ భయం ఒక బాధ్యతను కలిగి ఉంటుంది కాబట్టి మనం ఫెయిల్ అవ్వము అంటూ రవితేజ తెలిపారు.ఇక నాని మాట్లాడుతూ నాకు మీరు నటించిన విక్రమార్కుడు ( Vikramarkudu) సినిమాలో నటించాలని తెలిపారు.కానీ నేను మీ ఆంత బాగా నటించలేనని తెలిపారు.

ఇలా రవితేజ నటన గురించి నాని కామెంట్స్ చేసారు.ఇలా రవితేజ, నాని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube