యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )తో ఒక సినిమా కోసం పని చేస్తే ఆయన యాక్టింగ్ స్కిల్స్ కు ఎవరైనా ఫిదా అవుతారనే సంగతి తెలిసిందే.ఆర్.
ఆర్.ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, అలియా భట్ ( Alia Bhatt )పని చేయగా ఈ సినిమా సమయంలో వాళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.ఎన్టీఆర్30 వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని రీజన్స్ వల్ల అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో జాన్వీ కపూర్ నటించారు.
అయితే అలియా భట్ తాజాగా ఎన్టీఆర్ కొడుకులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ విషయం తెలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం తెగ సంతోషిస్తున్నారు.యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్( Abhay Ram, Bhargav Ram ) లకు కొత్త బట్టలు పంపి తారక్ కు, తారక్ కొడుకులకు ఆమె స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.
ఖరీదైన దుస్తులను ఆమె బహుమతిగా పంపగా తారక్ సోషల్ మీడియా ద్వారా అలియా భట్ సర్ప్రైజ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

తన పిల్లల విషయంలో అలియా భట్ చూపించిన అభిమానానికి తారక్ ఫిదా అయ్యారని తెలుస్తోంది.త్వరలోనే అలియా భట్ కూడా నా పేరుతో ఒక బ్యాగ్ చూస్తుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్లడించారు.ప్రస్తుతం తారక్ కొరటాల శివ( Koratala Shiva ) డైరెక్షన్ లో ఎన్టీఆర్30 సినిమాలో నటిస్తున్నారు.
అత్యంత భారీ బడ్జెట్ తో, క్రేజ్ ఉన్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కొన్నిరోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూట్ మొదలుకానుంది.ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.తారక్ వరుస విజయాలు అందుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని అభిమానులు భావిస్తున్నారు.







