యాదాద్రి భువనగిరి జిల్లా: మార్చి 28న భువనగిరిలో జరిగే సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని యాదాద్రి జిల్లా సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు.శనివారం మోత్కూరులో మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు అధ్యక్షతన జరిగిన మండల,టౌన్ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై, భారత రాజ్యాంగాన్ని ఎత్తేసే బీజేపీ కుట్రలను ప్రజలకు తెలియజేస్తూ, సిపిఎం అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు నడుస్తున్నాయనితెలిపారు.
అదిలాబాద్ లో ప్రారంభమైన జాతా మార్చి 28 న యాదాద్రి జిల్లాకు వస్తున్న సందర్భంగా సిపిఎం జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించి,బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బోల్లు యాదగిరి,జిల్లా కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కూరెళ్ళ రాములు,టౌన్ కార్యదర్శి కూరపాటి రాములు, మండల కమిటీ సభ్యులు పైళ్ళ రామిరెడ్డి,దడిపల్లి ప్రభాకర్,కూరేళ్ళ నర్సింహ, మెతుకు అంజయ్య, కందుకూరి నర్సింహ, కొంపల్లి గంగయ్య, సైదులు,తాటి కర్ణకర్, తదితరులు పాల్గొన్నారు.