వైసీపీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ నుంచి పదవి పొందిన పృథ్వీరాజ్( Prudhvi Raj ) ప్రస్తుతం జనసేన పార్టీలో( JanaSena ) ఉన్న సంగతి తెలిసిందే.జనసేన పార్టీ తరపున తరచూ వైసీపీపై, జగన్ పై విమర్శలు చేయడం ద్వారా పృథ్వీరాజ్ వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే పృథ్వీరాజ్ విమర్శలను వైసీపీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు.పృథ్వీరాజ్ తాజాగా తాను పోటీ చేసే స్థానం గురించి చెప్పుకొచ్చారు.

చోడవరం నుంచి తనకు పోటీ చేయాలని ఉందని అక్కడినుంచి పోటీ చేస్తే తాను ఎమ్మెల్యే కావడం గ్యారంటీ అని పృథ్వీరాజ్ చెబుతున్నారు.తాను మెగా కాంపౌండ్ లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.చోడవరంలో( Chodavaram ) 44,000 మంది తనవాళ్లే అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.కరోనా సమయంలో తనకు ఎవరూ సహాయం చేయలేదని ఆయన తెలిపారు.ఆ సమయంలో నాగబాబుతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సహాయం చేస్తారని పృథ్వీరాజ్ అన్నారు.

వైజాగ్ లో( Visakhapatnam ) తనకు బంధువులు ఉన్నారని నా ఇంటిపేరు బలిరెడ్డి అని చోడవరంలో ఉన్నవాళ్లలో ఎక్కువమంది ఇంటిపేరు ఇదేనని పృథ్వీరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.పవన్ సూచిస్తే చోడవరం నుంచి పోటీ చేస్తానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పృథ్వీరాజ్ కు అక్కడినుంచి పోటీ చేసే అవకాశం వస్తుందో లేదో చూడాలి.
పృథ్వీరాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే పృథ్వీరాజ్ కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో పాలిటిక్స్ లో సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. జనసేన వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో స్పష్టత రావాల్సి ఉంది.
పృథ్వీరాజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.పృథ్వీరాజ్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.







