రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చు అని,జిల్లా పరిధిలో ఏరకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు “ఆశ, భయం “అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.
ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుంది.భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుంది అదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు, వ్యాలెట్స్ ఇతర వాటి నుండి డబ్బులు సులువుగా దోచేస్తున్నారు.కావున మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు…
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈవారం రోజులలో నమోదు అయిన కొన్ని సైబర్ కేసుల వివరాలు.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలుకి ఫేక్ నెంబర్ నుండి పార్ట్ టైం జాబ్ వర్క్ ఫ్రం హోం అని వాట్సప్ కి మెసేజ్ వచ్చింది.
మొదటగా జాబ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి మోసగించారు.బాధితురాలు పలు దఫాలుగాడబ్బులు పంపి 1,64,140/- నష్ట పోయారు.
గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి అన్నోన్ నెంబర్ నుంచి వాట్సప్ కి న్యూడ్ మెసేజ్ వచ్చింది తర్వాత న్యూడ్ వీడియో కాల్ చేసి వ్యక్తి వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోలు యూట్యూబ్లో పెడతామని బెదిరించి డబ్బులు అడిగారు.కావున బాధితుడు 24, 500/- నష్టపోయాడు.
వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఎస్బిఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము అని కాల్ వచ్చింది .మీ ఎస్బిఐ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది, అని మోసగించి క్రెడిట్ కార్డు యొక్క క్రెడియన్షియల్స్ ఎంటర్ చేయమని చెప్పారు.చేసిన వెంటనే డబ్బులు డెబిట్ అయినాయి.తద్వారా బాధితులు 45,900/- నష్టపోయాడు.ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఇంస్టాగ్రామ్ లో పెన్ పెన్సిల్ ప్యాకింగ్ జాబ్ అని యాడ్ చూసి వారిని కాంటాక్ట్ అయ్యాడు.వర్క్ ఫ్రం హోం,జాబ్ మెటీరియల్ మీ ఇంటికి వస్తుంది మరియు ఐడి కార్డ్ కోసం మీరు 620/- పంపించండి.
అని చెప్పగా బాధితుడు పంపించాడు.మళ్లీ కొన్ని డబ్బులు అడిగారు.
తద్వారా బాధితుడు మోసపోయానని గమనించి సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాడు.
కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి తన ఫ్రెండ్ పేరుతో ఫేక్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి అర్జెంటుగా మనీ అవసరం ఉన్నాయి అని మెసేజ్వచ్చింది.
బాధితుడు తన ఫ్రెండ్ అనుకొని అమౌంట్ సెండ్ చేశాడు.తద్వారా బాధితుడు 10,000 రూపాయలు నష్టపోయాడు.
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ అని ఫేక్ కాల్ వచ్చింది.మూడు లక్షల లోన్ ఎలిజిబులిటీ ఉందని బాధితుని దగ్గర నుండి లోన్ అప్రూవల్,జిఎస్టి, ఇన్సూరెన్స్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ద్వారా 35,000 ట్రాన్స్ఫర్ చేపించుకున్నాడు.మోసపోయిన బాధితుడు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాడు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.
ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.
ఇంస్టాగ్రామ్లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండి, మోసపోకండి అంటూ జిల్లా ప్రజలకు తగు సూచనలు, జాగ్రత్తలు చేసిన ఎస్పీ
.






