సీనియర్ నటి కాంచన( actress Kanchana ) గురించి అందరికి తెలిసిందే.జీవితం అంత కష్టపడి పని చేసి దానధర్మాలు చేస్తూ జీవిస్తున్నారు.
చిన్న నాటి నుంచి నటన మరియు భక్తి తప్ప మరొకటి తెలియని కాంచనమ్మ పెళ్లి కూడా చేసుకోకుండా ఎలాంటి సుఖాలకు నోచుకోకుండా అందరి చేత మోసపోయి చివరికి కన్నా తల్లుదండ్రుల చేత విష ప్రయోగం జరిపించుకొని బ్రతికి బట్ట కట్టింది.మాములు ఆడవారు ఎవరైనా ఆమె స్థానంలో ఉంటె ఇప్పటికే ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని కన్ను మూసేవారు.
కానీ ఆమె చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కాంచన సినిమాల్లో నటిస్తూనే డబ్బు సంపాదిస్తూ, వచ్చిన ఆ డబ్బును దేవస్థానాలు( Temples ) దానంగా ఇస్తూ పదిమందికి సేవ చేస్తుంది.

ఇక ఇప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే తాజాగా చెన్నై లోని పద్మావతి అమ్మవారి కోసం ఒక గుడి కట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) వారు సంకల్పించగా అందుకు కావాల్సిన భూమి కోసం వెతుకున్నారు.ఈ విషయం తెలిసిన నటి కాంచన తన పేరు మీద ఉన్న ఒక 40 కోట్ల రూపాయలను గుడి కోసం దానంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఏ నటీనటులైన, డబ్బు దండిగా ఉన్నవారైనా తమకు లాభం లేనిదే జేబు లోంచి ఒక్క రూపాయి కూడా తీయరు.అలాంటిది ఇలా నలభై కోట్లకు పైగా డబ్బులు వచ్చే ఒక భూమిని దేవుడి కోసం దానం చేయడం అనేది కేవలం కాంచనకు మాత్రమే చెల్లింది.

ఇలా ఎంత డబ్బైనా సరే దానం చేయడం కాంచనకు మొదటి సారి ఏమి కాదు.తల్లిదండ్రులు చంపాలని చూస్తే తప్పించుకొని వారిపై కేసు పెట్టి తన ఆస్తిని తిరిగి దక్కించుకొని ఆ ఆస్తి మొత్తం కూడా దేవాలయానికి దానంగా ఇచ్చేసింది.డబ్బు పాపిష్టిది అని అది ఎంత పని అయినా చేయిస్తుందని అందుకే అవసరానికి మించి డబ్బు ఉంచుకోవడం లో ఎలాంటి ఉపయోగం లేదు అని ఆవిడా అభిప్రాయం.ఇక మొన్నటికి మొన్న బాహుబలి సినిమాలో రాజమౌళి రెండు రోజుల కోసం ఆమెని మొదట సంప్రదించి ఆ తర్వాత వద్దు అన్నారని, రెండు రోజుల కోసం 5 లక్షలు అడిగితే ఇవ్వలేదు అంటూ వాపోయారు.







