ఈ నెల మార్చి 31 నుండి ఐపీఎల్ ( IPL ) ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా క్రికెట్ అభిమానులకు మంచి శుభవార్తను చెప్పింది జియో.
ఇప్పటికే జియో ( JIO ) అంటే ఎక్కువగా ఆఫర్లు ఉంటాయని తెలిసిందే.కానీ క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ వీక్షించడం కోసం 3 సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.
క్రికెట్ అభిమానులు True -5G డేటా తో ఎంచక్కా క్రికెట్ మ్యాచ్లను చూడవచ్చు.ఐపీఎల్ కోసం జియో తమ వినియోగదారుల కోసం 40GB వరకు ఉచిత డేటాను పొందే మూడు రీచార్జ్ ప్లాన్లను ముందుకు తెచ్చింది.

ఇందులో రూ.999, రూ.399, రూ.219 లతో 3 సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను( Prepaid Plans ) అందుబాటులోకి తెచ్చింది.రూ.999 ప్లాన్ ద్వారా రోజుకు 3GB డేటా తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.అంతేకాకుండా ఈ ప్లాన్ పై రూ.241 ఉచిత ఓచర్ పొందవచ్చు.ఈ 84 రోజుల ప్లాన్ చెల్లుబాటు వరకు 40GB డేటా ను అందిస్తుంది.తరువాత రూ.399 రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే రోజుకు 3GB డేటాతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.

అంతేకాకుండా ఈ రూ.399 ప్లాన్ పై రూ.61 విలువైన ఉచిత వోచర్ తో పాటు 6GB డేటాను అదనంగా పొందవచ్చు.ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల తరువాత ప్యాక్ గడువు ముగుస్తుంది.మూడవ రీఛార్జ్ ప్లాన్ రూ.229 ప్యాక్ 14 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.రోజుకు 3GB డేటా తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 2GB డేటాను అదనంగా పొందవచ్చు.క్రికెట్ అభిమానులు మ్యాచులు వీక్షించడానికి ఈ ప్లాన్స్ ను జియో అందుబాటులో ఉంచింది.







