గోధుమ పంటకు సారవంతమైన వండ్రు నేలలు, బంకమట్టి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.అదే విధంగా ఉదజని సూచిక 6 నుంచి 8.5 ఉండే ఎటువంటి నేలలైనా అనుకూలంగా ఉంటాయి.నీటి వసతులు ఉండే తేలిక నేలలు, మద్యస్థ ఇసుక నెలలు కూడా అనుకూలమని చెప్పవచ్చు.
గోధుమ పంట( Wheat ) వేసే నేలలు చాలావరకు చదునుగా ఉండాలి.వేసవికాలంలో రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు ఉండడం వల్ల చాలా వరకు కలుపు సమస్యలు ఉండవు.
ఒక ఎకరాకు 40 కిలోల విత్తనాలు అవసరం.కిలో విత్తనాలకు 2.5 గ్రాముల కార్బండిజం( Carbendazim ) తొ విత్తన శుద్ధి చేసుకుని, విత్తిన పది రోజుల వ్యవధిలో ఒకసారి నీటి తడి అందించాలి.వరుసల మధ్య 20 సెంటీమీటర్లు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్లు ఐదు సెంటీమీటర్లు లోతులో విత్తనాలు నాటుకోవాలి.
పంట వేసిన నెల వ్యవధిలో ఒకటి లేదా రెండుసార్లు కలుపు తీయాలి.నేల స్వభావాన్ని బట్టి నాలుగు లేదా ఐదు సార్లు నీటి తడులు అందించాలి.పూతకు వచ్చే సమయంలో, గింజలు పాల దశలో ఉన్నప్పుడు నీటి తడులు కచ్చితంగా అవసరం.ఇక గోధుమ పంటకు చీడపీడల బెడద కాస్త తక్కువగానే ఉంటుంది.
అయినా చీడపీడల నివారణ కోసం ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల మాంకోజెబ్ G మెటాలాక్సిల్ కలిపి 20 రోజుల వ్యవధిలో ఒకటి లేదా రెండుసార్లు పిచికారి చేయాలి.

పంట పక్వ దశకు వచ్చిన తర్వాత కోసి ఎండలో బాగా ఆడిన తర్వాత పశువులతో తొక్కించడం లేదా ట్రాక్టర్ సహాయంతో పంట నూర్పిడి చేసుకోవాలి.గింజలలో తేమశాతం 8 నుండి 10 వరకు ఉండేటట్టు బాగా ఆరబెట్టి, ఆ తరువాత గోధుమ పంటను నిలువ .చీడపీడల బెడద ఉన్న సమయంలో వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహా మేరకు తక్కువ మోతాదులో రసాయనాలతో పిచికారి చేయడంతో అధిక దిగుబడి ( High yield )పొందవచ్చు
.






