తరచూ డీహైడ్రేట్ అవుతున్నారా? అయితే ఇది కచ్చితంగా మీ డైట్ లో ఉండాల్సిందే!

డీహైడ్రేషన్.చాలామంది సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది.శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.అందులోనూ ప్రస్తుత వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.

 This Melon Juice Helps To Prevent Dehydration! Dehydration, Melon Juice, Waterme-TeluguStop.com

చాలా మంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తుంటారు.కానీ డీహైడ్రేషన్ వల్ల తీవ్రమైన తలనొప్పి, మానసిక గందరగోళం, అలసట, ఆకలి మందగించడం, విపరీతమైన దాహం, మూర్ఛ తదితర లక్షణాలు తలెత్తుతాయి.

అందుకే డీహైడ్రేషన్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.

మీరు కూడా తరచూ డీహైడ్రేట్ అవుతున్నారా.? అయితే అసలు చింతించకండి.వెంటనే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

ఈ జ్యూస్ డీహైడ్రేషన్ సమస్య నుండి మిమ్మల్ని రక్షించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.మీ బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Latest, Melon, Muskmelon, Watermelon-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి వాటర్ పోసి ఇర‌వై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు( Watermelon ), ఒక కప్పు కర్బూజ పండు ముక్కలు, ఆరు నుంచి ఎనిమిది నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పు, మూడు వాల్ నట్స్, రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ), ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్‌ చేసుకున్న జ్యూస్ లో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని సేవించడమే.

Telugu Tips, Latest, Melon, Muskmelon, Watermelon-Telugu Health

ఈ మెలన్ జ్యూస్ రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజు తీసుకుంటే డీహైడ్రేషన్ అన్నమాటే అనరు.మీ బాడీ ఎల్లప్పుడు హైడ్రేటెడ్ గా ఉంటుంది.అలాగే ఈ మెలన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది.అధిక రక్తపోటు సమస్య( Blood pressure) ) నుంచి విముక్తి లభిస్తుంది.మరియు చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

కాబట్టి డిహైడ్రేషన్ సమస్యతో తరచూ సతమతం అయ్యేవారు తప్పకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ మెలన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube