టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన నటీమణులలో సనా ఒకరు.ఈమె పూర్తి పేర్ షనూర్ సనా బేగమ్( Sana ) కాగా ఈ నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నేను జీవితంలో అత్యంత బాధ పడిన సందర్భం అమ్మ పోవడం, నాన్న పోవడం అని సనా అన్నారు.ఆ సమయంలో మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానని ఆమె కామెంట్లు చేశారు.
పనిలో బిజీ అయిన తర్వాత ఏ ఆలోచన ఉండదని సనా తెలిపారు.
అమ్మ, నాన్న నాతో కలిసి ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.
నాన్న స్ట్రోక్ వల్ల, అమ్మ డిప్రెషన్ వల్ల చనిపోయారని సనా చెప్పుకొచ్చారు.నా కూతురిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచన చేయలేదని నా కూతురికి మంచి ఆఫర్లు వచ్చిన సమయంలో తను రిజెక్ట్ చేసిందని సనా అన్నారు.
ఈ జనరేషన్ కు తను పూర్తిగా డిఫరెంట్ అని ఆమె తెలిపారు.ఆ తర్వాత నా కూతురికి పెళ్లి చేశామని సనా తెలిపారు.

నా కూతురికి 5 సంవత్సరాల కొడుకు ఉన్నాడని ఆమె ప్రస్తుతం యూట్యూబర్ అని సనా అన్నారు.నా కూతురు పెళ్లి చేసుకున్న వాళ్ల కుటుంబం అంతా మమ్మల్ని మోసం చేసిందని ఈ విషయాల గురించి గతంలో కూడా నేను మాట్లాడానని సనా అన్నారు.వాళ్లు మా అమ్మాయికి ఒక హౌస్ చూపించి మరో హౌస్ లో పెట్టారని దుబాయ్( Dubai ) ఆస్ట్రేలియా తీసుకెళ్లి టార్చర్ చేశారని సనా చెప్పుకొచ్చారు.

నా కూతురిని ఫుడ్ పెట్టకుండా లాక్ చేశారని సనా కామెంట్లు చేశారు.నా కూతురి గోల్డ్ అంతా బ్యాంక్ లో పెడతామని చెప్పి లాక్కున్నారని సనా అన్నారు.నా కూతురు ఇంట్రోవర్ట్ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఆస్ట్రేలియా( Australia )కు వెళ్లిన సమయంలో నాకు అన్ని విషయాలు తెలిసి వాళ్లంతా ఫ్రాడ్ అని అర్థమైందని సనా అన్నారు.







