ముందు నుండి వస్తున్న రూమర్స్ ఎట్టకేలకు నిజమయ్యాయి.తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూమెంట్ ఈ రోజు నిజమయ్యింది.
ఎన్నో రోజుల ఫ్యాన్స్ కల ఈ రోజు తీరిపోయింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) చేయనున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘NTR30‘ గ్రాండ్ గా ఈ రోజు లాంచ్ అయ్యింది.
ఈ సినిమా ప్రకటించి కూడా ఏడాది దాటిపోయింది.
అందుకే తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు.
మరి ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ గా ప్రముఖుల మధ్య లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్30 (NTR30) ప్రాజెక్ట్ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో హైదరాబాద్ లో ఈ రోజు కొంతమంది అతిరధ మహారథుల మధ్య గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
ఈ విషయం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది.

ఇక ఈ రోజు ఈ లాంచింగ్ ప్రోగ్రాం కు ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ), ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తో పాటు గెస్టులుగా ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli ), ఇంకా ఎన్టీఆర్ నెక్స్ట్ చేయబోతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంకా నిర్మాత దిల్ రాజు వంటి కొద్దీ మంది సమక్షంలో ఈ లాంచింగ్ ఈవెంట్ జరిగింది.మరి ఈ సినిమా ఈ రోజు లాంచ్ అవ్వడంతో రెగ్యురల్ షూట్ నెక్స్ట్ మంత్ నుండి జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.
చూడాలి మరి షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.







