మామ్మూలుగానే ఐఫోన్( iPhone ) ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.ఈ నేపథ్యంలో లక్ష, రెండు లక్షల ఖరీదు ఫోన్లను చూసాం, కానీ ఏకంగా ఏకంగా రూ.45 లక్షల ధర అంటున్నారు… అని ఆశ్చర్యపోతున్నారా? విషయం తెలుసుకోవాలంటే ఈ పూర్తి కధనాన్ని చదవండి.మనలో కొంతమంది ఐఫోన్ కొనడానికి సంవత్సరాల తరబడి డబ్బును పోగేస్తూ వుంటారు.
ఆపిల్ నుండి రాబోయే లేదా లేటెస్ట్ మోడల్‌పై చాలా క్రేజ్ ఉంటుంది.అందుకే లక్షలు వెచ్చించి మరీ కొనుక్కుంటూ వుంటారు.
ఇపుడు మనం చెప్పుకోబోయేది మాత్రం కొత్తతరం ఫోన్ గురించి కాదు, ఈ వార్త పాత మోడల్‌కి సంబంధించినది.
అవును, తాజాగా ఓ పాత మోడల్ ఐఫోన్( older model iPhone ) ధర ఏ లేటెస్ట్ మోడల్‌కు కూడా లేనంతగా విపరీతంగా పెరిగి అందరినీ అవాక్కయేలా చేసింది.ఇది ఆపిల్ మొదటి తరం ఐఫోన్.విశేషమేంటంటే ఈ ఫోన్ సీల్డ్ ప్యాక్ ( Sealed pack )లో ఉండటం కొసమెరుపు.ఇపుడు ఇదే యాపిల్ ఫస్ట్ జెన్ ఐఫోన్ వేలంలో రూ.45 లక్షలు పలకడం విశేషం.వేలం వేయడం ఇది మొదటి కేసు కానప్పటికీ ఆపిల్ మొదటి తరం సీల్డ్ ప్యాక్ ఐఫోన్ ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది.దీని తర్వాత, వివిధ రకాల మోడళ్ల ఐఫోన్లు $ 35,000, $ 39,000కు వేలం వేయబడ్డాయి.
ఇకపోతే, ఆపిల్ తన మొదటి ఐఫోన్‌ను 2007లో విడుదల చేసిన సంగతి విదితమే.మొదటి ఐఫోన్ సుమారు 16 సంవత్సరాల క్రితం మార్కెట్లోకి వచ్చింది.దీని ప్రారంభ ధర అప్పట్లో $ 499 అంటే మన కరెన్సీలో దాదాపు రూ.41,170 ఉండేది.అలాంటిది ఇప్పుడు రూ.45 లక్షలు పలకడం కొసమెరుపు.ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే, 3.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండి, 320×480 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది.412 MHz వన్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండి, 2MP వెనుక కెమెరా ఇవ్వబడింది.కానీ అందులో సెల్ఫీ కెమెరా అనేది లేదు.
iOS 3, సింగిల్ సిమ్ సపోర్ట్‌తో ఇది వచ్చింది.