ఎన్నారై సైట్ సూపరింటెండెంట్‌కు సింగపూర్‌లో జైలు శిక్ష.. ఏం తప్పు చేశాడంటే..

భారత సంతతికి చెందిన జయరామన్ శంకరన్( Jayaraman shankaran ) అనే కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌వైజర్‌/సూపరింటెండెంట్‌కు సింగపూర్ కోర్టు( Singapore court ) షాక్ ఇచ్చింది.మలేషియా పౌరసత్వం కలిగి ఉన్న ఈ ఎన్నారై ( NRI ) పరంజాలను స్థిరంగా నిర్మించలేదు.

 Indian-origin Site Superintendent Jailed In Singapore Details, Indian-origin Man-TeluguStop.com

ఈ పరంజా 2017లో కూలిపోగా తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు.ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన శంకరన్‌కి సింగపూర్ కోర్టు ఏకంగా 6 నెలల జైలు శిక్ష విధించింది.

పరంజా అంటే ఏదైనా ఇల్లు నిర్మించడానికి ఇనుప కడ్డీలు లేదా కర్రలతో కట్టే ఒక ఎత్తైన వేదిక.తెలుగు వాడుక భాషలో వీటిని పరంజీలు అని కూడా అంటారు.

పరంజా కూలిపోవడం వల్ల కార్మికులకు ఎముకలు విరిగాయి.కొందరికి దంతాలు విరగగా మరికొందరికి బాగా గాయాలయ్యాయి.శంకరన్‌పై మొదట్లో వర్క్‌ప్లేస్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్ కింద నిర్లక్ష్యానికి పాల్పడ్డారని అభియోగాలు మోపారు.అయితే, అతను చివరికి దోషిగా నిర్ధారించబడ్డాడు.2022, నవంబర్ 18న దోషిగా తేల్చారు.జురాంగ్ ద్వీపంలో ఉన్న ఒక కంటైనర్ టెర్మినల్ అయిన హారిజోన్ సింగపూర్ టెర్మినల్స్ వర్క్‌సైట్‌లో పరంజా కుప్పకూలింది.

స్కాఫోల్డ్‌( Scaffold ) లేదా పరంజాపై పని చేయడానికి 39 పరంజా ఎరెక్టర్‌లను వాడినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి.వీరంతా గాయపడిన వారితో సమానమైన ప్రమాదాలకు గురయ్యారు.శంకరన్ క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో అతను పరంజా ఏర్పాటుకు సూచనలు ఇవ్వడమే కాకుండా అది ఎలా చేయాలో కూడా చెప్పినట్లు అంగీకరించాడు.ఇక పరంజా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా నిర్మాణం జరిగిందని పరిశోధనలు కనుగొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube