సాధారణంగా షూటింగ్ అనేది ఎత్తైన ప్రదేశాలలో, తర్వాత ప్రాంతాలలో చేసేటప్పుడు హెలికాప్టర్లు మరియు చాపర్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు.సినిమా బడ్జెట్ కు అయితే ఇవి సరిపోతాయి.
కానీ ఫోటోగ్రఫీ ( Photography ) అంటే ఇష్టం ఉండేవాళ్లు, షార్ట్ ఫిలిం తీసేవాళ్లు హెలికాప్టర్ లాంటివి వాడడం బడ్జెట్ పరంగా అసాధ్యం.
టెక్నాలజీ ( Technology ) అభివృద్ధి చెందుతున్న క్రమంలో హెలికాప్టర్లకు బదులు కెమెరా డ్రోన్లు( Camera Drones ) అందుబాటులోకి వచ్చాయి.
ఇవి బడ్జెట్ పరంగా తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.రూ.10వేల బడ్జెట్ లో ఉండే బెస్ట్ కెమెరా డోన్లు ఏంటో చూద్దాం.
భయాని గరుడ డ్యూయల్ కెమెరా డ్రోన్:
ఇది చాలా చిన్నగా మరియు తేలికగా ఉంటుంది.దీనికి రెండు కెమెరాలు, ఒక మోటర్, వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.వైఫై ఎనేబుల్డ్ డ్రోన్ కెమెరా గా చెప్పుకోవచ్చు.
ఇందులో చేతి కదలికల ద్వారా నియంత్రించే ఫీచర్ ఉండడంతో కెమెరాల మధ్య దూరం, సెల్ఫీ తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.ఈ డ్రోన్ గాలిలో 50 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి, 30 నిమిషాల వరకు నిరంతరంగా పనిచేస్తుంది.అమెజాన్లో రూ.9999 కు అందుబాటులో ఉంది.
నిలయ్ గరుడ కెమెరా డ్రోన్:
ఇది రెండు కెమెరాలతో ఉండే పోర్టబుల్ డ్రోన్ కెమెరా. ఇందులొ వైడ్ యాంగిల్ లెన్స్, రెండు లైట్లు, మోటార్, ఇందులో ఆప్టికల్ ఫ్లో ఫంక్షన్ వల్ల ఇమేజ్ లు వేగంగా కదులుతాయి.ఇది కూడా గాలిలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిరి, 30 నిమిషాల పాటు నిరంతరంగా పనిచేస్తుంది.అమెజాన్లో రూ.9899 కు అందుబాటులో ఉంది.
హిల్ స్టార్ అబ్స్టాకిల్ అవాయిడెన్స్ కెమెరా డ్రోన్:
ఇది ఫోల్డబుల్, వైఫై ఎనేబుల్ డ్రోన్ కెమెరా. ఇందులో నాలుగు యాక్సిస్ డ్యూయల్ కెమెరా ఇంకా విజువల్ ఓవర్ ని కలిగి ఉంది.దీనిని అరచేతితో పట్టుకొని షూట్ చేయవచ్చు.అమెజాన్లో రూ.6199 కు అందుబాటులో ఉంది.