సినిమాల్లో కామెడీ చేసి ఆ తర్వాత చనిపోతూ మనల్ని ఏడిపించిన కమెడియన్స్ ఎవరంటే..?

కొన్ని సినిమాల్లో కమెడియన్స్ ( Comedians ) వాళ్ల కామెడీ తో మనల్ని నవ్విస్తారు.అలాగే వాళ్ళు సినిమా విజయం లో కూడా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు.

 Comedian Roles Died In Movies Suneel Venumadhav Ali Details, Comedian Roles , Mo-TeluguStop.com

కొన్ని సినిమాలు అయితే కమెడియన్స్ చేసిన కామెడీ వల్లే సూపర్ హిట్ అయినవి ఉన్నాయి…అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాల్లో కమెడియన్స్ పాత్ర చాలా వరకు ఉండేది ఇప్పుడిప్పుడు కమెడియన్స్ పాత్రలు తగ్గించారు కానీ అప్పట్లో బ్రహ్మనందం కోసమే ఒక కామెడీ ట్రాక్ రాసే వారు అలా బ్రహ్మనందం కామెడీ తో కూడా సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి…అయితే కొన్ని సినిమాల్లో కమెడియన్స్ చనిపోయి సినిమా చూసే ప్రేక్షకులని ఏడిపించారు.అలా ఏ సినిమాలో ఏ కమెడియన్ చనిపోయారో ఒకసారి తెలుసుకుందాం…

మాస్ సినిమాలో నాగార్జున ఫ్రెండ్ గా నటించిన సునీల్ ( Suneel ) ఆ సినిమా లో కామెడీ తో మనల్ని నవ్విస్తూనే ఒక టైం లో హీరోయిన్ జ్యోతిక గారిని సేవ్ చేసే ప్రాసెస్ లో తన ప్రాణాలను కోల్పోయి మనందరిని ఏడిపించాడనే చెప్పాలి…ఈ సినిమాలో సునీల్ చనిపోయేటపుడు పండించిన ఏమోషన్ చాలా బాగా వర్క్ ఔట్ అయిందనే చెప్పాలి.ఇక మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

 Comedian Roles Died In Movies Suneel Venumadhav Ali Details, Comedian Roles , Mo-TeluguStop.com

అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో వచ్చిన అన్నవరం సినిమా లో వేణుమాధవ్ ( Venumadhav ) చనిపోయి మనల్ని ఏడిపించారు.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది…పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంజా సినిమాలో కమెడియన్ అలీ( Comedian Ali ) కూడా చనిపోతాడు.ఈ సినిమా లో అలీ చనిపోయిన సిచ్వేషన్ చూస్తే నిజం గా ప్రతి ఒక్కరి కండ్లల్లో నీళ్ళు వస్తాయి…ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇలాంటి సినిమాలు తెలుగు లో చాలానే ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube