కెమెరా చేతిలో ఉందని సెలబ్రెటీలు ఎక్కడపడితే అక్కడ ఫోటోలు దిగుతారు.బ్యాగ్రౌండ్ ఎలా ఉన్నా కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు మరి ఓవర్గా కూడా చేస్తూ ఉంటారు.దీంతో నెటిజన్స్ వారిపై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.
ప్రతి చోట ఫోటోలు దిగడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు.అయితే తాజాగా దివి( Devi ) కూడా ఒక చోట ఫోటో దిగడంతో తనను బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకు ఆమె ఫోటోలు ఎక్కడ దిగిందో చూద్దాం.
టాలీవుడ్ లో ఇండస్ట్రీకి వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) లో అవకాశం రావడంతో అప్పటినుంచి ఈ బ్యూటీ అందరి దృష్టిలో పడింది.హౌస్ లో ఉన్నంతకాలం ఆటతీరుతో, మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది.
తన అందాలతో మాత్రం కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.ఇక బిగ్ బాస్ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా చేసింది.
చిరంజీవి( Chiranjeevi ) నటించిన సినిమాలో కూడా అవకాశం అందుకుంది.ఇక ఆ సినిమాలో తన పాత్రతో అంతగా మెప్పించలేకపోయింది.
సోషల్ మీడియాలో మాత్రం సమయాన్ని ఎక్కువగా గడుపుతుంది.నిజానికి తను ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
బిగ్బాస్ షో లో ఉన్నంతకాలం కాస్త పద్ధతిగా కనిపించిన దివి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.ఎప్పుడైతే హౌస్ నుండి ఒక క్రేజ్ అనేది వచ్చిందో ఇక అప్పటినుంచి అవకాశాల కోసం బాగా దిగజారిపోయింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపెట్టేసింది.
దీంతో ఈమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.నిత్యం ఫోటోషూట్లంటూ ఆ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది దివి.
ఇక అప్పుడప్పుడు ట్రిప్స్ కి కూడా వెళుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.
ఈరోజు ఉగాది సందర్భంగా తను కుండలు కొనటానికి మార్కెట్ కి వెళ్ళగా అక్కడ కుండలు తీసుకోకుండా వాటి మధ్యలో ఫోటోలకు ఫోజులిచ్చింది.దీంతో ఆ ఫోటోలు చూసి కుండలు కొనడానికి వచ్చావా ఇక్కడ కూడా ఫోటోలు దిగడానికి వచ్చావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక మరి కొంతమంది ఇక్కడ కూడా ఫోటోలు దిగడం అవసరమా అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.నిజానికి ఈమె ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగుతూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇక ప్రస్తుతం ఈమె ప్రాజెక్టుల విషయానికి వస్తే.ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేయగా ఆ సినిమా త్వరలో విడుదల కావటానికి సిద్ధంగా ఉంది.ఇక ఓ సినిమాలో కూడా చేస్తున్నట్లు తెలిసింది.