పోలీసులను ఆశ్రయించిన నటి హేమ... వారిపై ఫిర్యాదు చేసిన నటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి హేమ( Hema ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిన్న సినిమాలలో ఈమె అక్క వదిన పిన్ని పాత్రలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.

 Actress Hema Approached The Police The Actress Complained Against The ,hema, Mar-TeluguStop.com

ఇలా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి.సినిమాలకు ఈమె కాస్త దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే తాజాగా ఈమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది.అయితే ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే గత కొద్ది రోజుల క్రితం హేమ తన మ్యారేజ్ యానివర్సరీ( Marriage Anniversary ) సెలబ్రేట్ చేసుకున్నారు.ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు.అయితే ఈ వేడుకలలో భాగంగా ఈమె స్విమ్మింగ్ పూల్ లో కేక్ కట్ చేసి తన భర్తకు లిప్ లాక్ ఇచ్చారు.

ఇక ఈ విషయం గురించి పలు యూట్యూబ్ ఛానల్ విభిన్నమైన థంబ్ నెయిల్స్ పెడుతూ తన గౌరవానికి భంగం కలిగించారని ఈమె ఆరోపించారు.

ఈ క్రమంలోనే సదరు యూట్యూబ్ ఛానల్ పై ఈమె ఫిర్యాదు చేస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.తన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఆ వీడియోలను నీచమైన థంబ్ నైయిల్స్ తో వాడుతున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇలాంటి వార్తలను రాస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సదరు యూట్యూబ్ ఛానల్ పై ఈమె చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నారు.

ఇలా ఈమె పోలీసులను ఆశ్రయించి యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube