' లీకేజీ ' పై మైలేజ్ పొందే ప్లాన్ లో బీజేపీ !

ప్రస్తుతం రాజకీయంగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ఆ ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకుని జనాల్లో పట్టు సంపాదించాలనే లక్ష్యంతో బిజెపి వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది.

 Bjp In The Plan To Get Mileage On 'leakage', Telangana Bjp, Brs Party, Kcr, Kavi-TeluguStop.com

ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scan ) వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను అనేకమార్లు ఈడి అధికారులు విచారించారు.ఈ వ్యవహారంలో ఆమె అరెస్టు అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

వ్యవహారాలను తెలంగాణలో ఉపయోగించి బిఆర్ఎస్ అవినీతి పార్టీ అని నిరూపించే ప్రయత్నం బిజెపి చేస్తుంది.కెసిఆర్ కుటుంబ సభ్యులంతా అవినీతి వ్యవహారాల్లో ములుగు తేలుతున్నారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారని పదే పదే విమర్శలు చేస్తుంది.

వీటితో పాటు ఈ మధ్యన సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సి పరీక్ష పత్రాలు లీకేజీ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని మైలేజ్ పొందే ఆలోచనలో బిజెపి ఉంది.

Telugu Ap, Bandi Sanjay, Brs, Ed Enquiry, Kavitha, Telangana Bjp-Politics

ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ ( KCR )ను ఇరుక్కున పెట్టే విధంగా అనేక విమర్శలు చేస్తున్న బిజెపి తాజాగా మరింత ఉధృతంగా ఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.అలాగే నిరుద్యోగుల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది.ఈ నేపథ్యంలోనే పరీక్షలు రాసిన అభ్యర్థుల దగ్గరకు వెళ్లడం, యూనివర్సిటీలను సందర్శించి లీకేజీ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టే దిశగా బిజెపి( BJP ) నేతలు ముందుకు వెళ్ళబోతున్నారు వివిధ రూపాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రజాస్పందన ను తెలుసుకునే ప్రయత్నం  చేయబోతోంది.

దీనిలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను వారి తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.

Telugu Ap, Bandi Sanjay, Brs, Ed Enquiry, Kavitha, Telangana Bjp-Politics

ఇప్పటికీ ఈ పేపర్ లీకేజీ వ్యవహారాలపై తెలంగాణ బీజేపీ,  బీజేవైఎం ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో స్పందన వచ్చిందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.ఈ పేపర్ లీకేజీ అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యమన్న  అభిప్రాయంతో బిజెపి ముఖ్య నేతలు ఉన్నారు.కాంగ్రెస్ కంటే ఈ విషయంలో ముందున్నామని, ఇదే విధంగా అన్ని విషయాల్లోనూ దూకుడుగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో తెలంగాణ బీజేపీ ఉందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube