మానవుల మృతదేహాల నుండి ఎరువులు తయారు చేయవచ్చని మీకు తెలుసా..?

టెక్నాలజీ అనేది ప్రతి రంగంలో నూతన విధానాలను పరిచయం చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది.వ్యవసాయ రంగంలో ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువులను అధిక మోతాదులో వినియోగించేవారు.

 Did You Know That Fertilizer Can Be Made From Human-composting, Human Composting-TeluguStop.com

టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న క్రమంలో రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమైంది.

ఇప్పుడు ఏకంగా చనిపోయిన మనుషుల మృతుదేహాల నుండి ఎరువులను తయారు చేసే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.

మనిషి మృతదేహాన్ని కంపోస్ట్ చేసే విధానాన్ని హ్యూమన్ కంపోస్టింగ్( Human composting ) అంటారు.అమెరికాలోని న్యూయార్క్( New York ) నగరంలో మృతదేహాన్ని పర్యావరణ అనుకూల పద్ధతిలో ఖననం చేసి, తొలిదశలో మృతి దేహాన్ని మృదు కణజాలంగా మారుస్తారు.

నిపుణులు కూడా ఈ పద్ధతి చాలా సురక్షితమైందని అభిప్రాయ పడుతున్నారు.పైగా మానవ మృతదేహం యొక్క కంపోస్ట్ ఎరువు ద్వారా చాలా వ్యాధికారిక క్రిములు తొందరగా నాశనం అవుతాయి.2019 వ సంవత్సరంలో వాషింగ్టన్ ఆఫ్ అమెరికా మానవ మృతదేహాన్ని కంపోస్టింగ్ ఎరువుగా మార్చడానికి తొలి అడుగు వేసింది.తరువాత ఈ నగరానికి చుట్టుపక్కల ఉండే కాలిఫోర్నియా( California ), న్యూయార్క్ తో సహా పలు నగరాలలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

మనిషి చనిపోయిన తర్వాత కంపోస్టింగ్ ఎరువుగా మారడానికి 30 రోజుల సమయం పడుతుంది.ఈ కంపోస్టింగ్ నుండి సారవనంతమైన మట్టి తయారవుతుంది.హ్యూమన్ కంపోస్టింగ్ కోసం అమెరికా దాదాపు ఒక మిలియన్ ఎకరాల భూమి స్మశాన వాటిక కోసం రిజర్వ్ చేయబడింది.ఈ స్మశాన వాటికలో ఎటువంటి చెట్లు పెరగకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తుంటారు.

రసాయనిక ఎరువుల వాడకం కంటే హ్యూమన్ కంపోస్టింగ్ 1000రెట్లు మేలు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడో అంత్యక్రియలు, వివిధ పద్ధతులలో చేసే బదులు ప్రతి నగరంలో కొంత విస్తీర్ణం కేటాయించి పర్యావరణ అనుకూల స్థితిలో ఖననం చేయడం వల్ల, సారవంతమైన మట్టిని తయారుచేసుకుని ఎరువులుగా వినియోగించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube