'ఉస్తాద్'కు జోడీగా ఆ హీరోయిన్.. పూజాను పక్కన పెట్టేశారా?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో హరీష్ శంకర్( Harish Shankar ) ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.

 Ustaad Bhagat Singh Movie Update, Ustaad Bhagat Singh, Harish Shankar, Pawan Kal-TeluguStop.com

ఇక ఇప్పుడు ఇదే కాంబోలో ”ఉస్తాద్ భగత్ సింగ్”( Ustad Bhagat Singh ) సినిమాను ప్రకటించారు.పవన్ కళ్యాణ్ కోసం గత రెండేళ్లకు పైగానే వేచి ఉండి మరీ హరీష్ శంకర్ ఈ సినిమాను తీయడానికి సిద్ధం అయ్యాడు.

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో కమిట్ అయ్యిన ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఇక ఈ సినిమాను పూర్తి చేయడానికి పవన్ కాల్ షీట్స్ ఇచ్చాడని టాక్.అందుకే త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే అని అంతా అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఈమె కాదని మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది అని టాక్ వచ్చినప్పుడు పవన్ ఫ్యాన్స్ నుండి అంత ఎగ్జైట్ మెంట్ కనిపించలేదు.కానీ ఇప్పుడు ఈ సినిమాలో పవన్ సరసన కోలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ నటించనుంది అంటూ వినిపిస్తున్న వార్తల కారణంగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్ అవుతున్నారు.

దీంతో పవన్, మాళవిక జోడీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది అని అనిపిస్తుంది.మరి ఇదే నిజమైతే ఈ జోడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అనుకుంటున్నారు.మరి ఈ వార్తల్లో నిజముందా? లేదంటే రూమర్స్ గానే మిగిలి పోనున్నాయా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.అయితే ప్రస్తుతం పూజా హెగ్డే టైం బ్యాడ్ గా నడుస్తుంది.ఈమె చేతిలో ఈ సినిమా అయినా ఉంది దీంతో ఫామ్ లోకి రావొచ్చు అనుకున్న ఆమెకు ఈ ఆఫర్ కూడా చేజారిపోతే ఇక ఫ్యూచర్ కష్టమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube