విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఎన్నో ఏళ్ల తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తో అలాంటి హిట్ కొట్టడంతో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు.
అలాగే కమల్ ఫ్యాన్స్ కూడా ఈ సూపర్ హిట్ ను బాగా ఎంజాయ్ చేసారు.కమల్ హాసన్( Kamal Haasan ) మళ్ళీ ఫామ్ లోకి రావడంతో ఇప్పుడు ఈయన సినిమాల అప్డేట్స్ క్రేజీగా మారిపోతున్నాయి.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన ”ఇండియన్ 2( Indian 2 )” సినిమా కొత్తగా రీ స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తుండడంతో మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.
ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
మరి ఈ సినిమా కమల్ కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో వేచి చూడాలి.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత కమల్ తన లైనప్ లో భారీ సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు.ఈయన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ( Mani Ratnam )చాలా ఏళ్ల తర్వాత మరో సినిమా చేయబోతున్నాడు.కమల్ హాసన్ కెరీర్ లో 234వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.
ఇప్పుడు ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.అందుతున్న సమాచారం ప్రకారం.
ఈ సినిమా షూట్ జూన్ నుండి స్టార్ట్ చేయనున్నారని వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా సహ నిర్మాతలలో కమల్ కూడా ఉన్నారు.ఈ సినిమాలో త్రిష( Trisha ) కథానాయికగా నటిస్తున్నట్టు తెలిసింది.చీకటి రాజ్యం సినిమా తర్వాత ఈ కాంబో మళ్ళీ చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఇప్పుడు రాబోతున్నారు.
దీంతో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి.ప్రెజెంట్ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.