సంక్షేమ పథకాల పార్టీ తెలుగుదేశం పార్టీ - ఆవునూరి దయాకర్ రావు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపళ్లి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల కో ఆర్డినేటర్ కడారి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరిసిల్ల నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ రావు మాట్లాడుతూ కరపత్రాలు పంచుతూ ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ వివరించడం జరిగింది.

 Welfare Schemes Party Telugu Desam Party  Avunuri Dayakar Rao Details, Welfare S-TeluguStop.com

దీని ద్వార ప్రతి ఒక్కరు చదువుకొని తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకోచ్చినా పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు.రెండు రూపాయల కిలో బియ్యం, మంచినీటి కొరకు వాటర్ ట్యాంకులు,సిసి రోడ్లు, ఇంటింటికి సైకిలు,రజకులకు ఇస్త్రీ పెట్టెలు,బకెట్లు,పక్క గృహాలు,మహిళా డ్వాక్రా రుణాలు, అంగన్వాడి కేంద్రాలు, గవర్నమెంట్ హాస్పిటల్,వితంతువులకు పింఛన్లు,

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

వృద్ధులకు పింఛన్లు చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వారి కృషి వల్ల పేద ప్రజలకు అందే విధంగా చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీకే దక్కిందని గర్వంగా పేదల పార్టీ అని తెలియజేశారు.తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరు ఆదరించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ, మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించిన పార్టీ, మహిళలకు సమాన ఆస్తి హక్కులు కల్పించిన పార్టీ, మహిళలకు కండక్టర్ పోస్ట్లు కలిగించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీయేనని ప్రజల కొరకు పోరాటం చేసే పార్టీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మచ్చ ఆంజనేయులు,గ్యాధ సత్తయ్య, పయ్యావుల లక్ష్మణ్ ,కోడం దత్తాద్రి, మల్లారపు ప్రకాష్, పంజా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube