ప్రొడ్యూసర్ సి కళ్యాణ్…( Producer C Kalyan ) నిర్మాతగా జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇంటిలిజెంట్, రూలర్, జై సింహా వంట సినిమాలను నిర్మించాడు.తీసింది కేవలం ఐదు సినిమాలే అయినప్పటికీ పలు వివాదాలతో కళ్యాణ్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు.
మెగా ఫ్యామిలీ అండదండలు నిండుగా ఉన్న సి కళ్యాణ్ మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో లోఫర్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ వంటి సినిమాలు చేశాడు.అలాగే బాలకృష్ణ అంటే కూడా సి కళ్యాణ్ కి విపరీతమైన అభిమానం అందుకే అతనితో జై సింహా, రూలర్ వంటి చిత్రాలు నిర్మించాడు.
ఇటు మెగా, అటు నందమూరి కుటుంబాలకు ఆప్తుడుగా ఉన్న సి కళ్యాణ్( C Kalyan ) వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక నష్టాలను, కష్టాలను చవి చూశాడనే విషయం ఎవరికీ తెలియదు.

సి కళ్యాణ్ సినిమాలు తీసిన నష్టపోయాడు అలాగే ఇప్పటికీ తీస్తూనే ఉన్నాడు.ఇండస్ట్రీలో ఏం జరిగినా తనదైన రీతిలో స్పందిస్తూ వివాదాలతో చెలగాటమాడుతూ ఉంటాడు.అయితే సినిమా జీవితాన్ని కాసేపు పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి.
ఆయన భార్య కల్పన( Kalpana ) హైదరాబాదులో సి కళ్యాణ్ షూటింగ్ లో ఉన్న సమయంలో విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఇది జరిగి చాలా ఎళ్లే అవుతుంది అయినప్పటికీ ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సి కళ్యాణ్ తన భార్య మరణం గురించిన కొన్ని వాస్తవాలను పంచుకున్నాడు.

తన భార్య కల్పనా చాలా సెన్సిటివ్ అని పక్కింటి వారితో జరిగిన గొడవ వల్ల మనస్థాపం చెంది విషం తీసుకుని చనిపోయిందని, ఆ సమయంలో ఆమె చెన్నైలో తన సొంత ఇంట్లో ఉండగా తాను హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నానని, నాతో పాటు బ్రహ్మానందం కూడా ఉండడంతో నా భార్య చనిపోయిన విషయం తెలిస్తే ఎక్కడ షూటింగ్ పాడవుతుందో అని ఎవరికి చెప్పలేదని తెలిపాడు సి కళ్యాణ్.ఆ తర్వాత ఆ షూటింగ్ ప్యాకప్ చెప్పగానే తన తమ్ముడు బోరున వినిపించడంతో విషయం అందరికీ తెలిసిందన్నాడు.కనీసం ఆరోజు విమానం ఎక్కడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో బ్రహ్మానందం డబ్బులు ఇచ్చి మరి చెన్నై విమానం ఎక్కించాడని అలా తన భార్యను తాను కోల్పోవడం వల్ల దాదాపు 15 ఏళ్ల పాటు నరకం చూసానని చెప్పుకొచ్చాడు కళ్యాణ్.







