వైరల్: ట్రాఫిక్ పోలీసు పెద్ద మనసు.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు!

సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగాక ఆసక్తి కరమైన విషయాలు వైరల్ అవుతూ వస్తున్నాయి.ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే… ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసుల( Traffic Police ) ఉదార స్వభావానికి సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.

 Viral: The Traffic Police Has A Big Heart Netizens Are Overflowing With Praise ,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక వీడియో వైరల్ అవుతూ నెటిజన్ల మెప్పుని పొందడం మనం గమనించవచ్చు.ట్రాఫిక్ పోలీసులు నిత్యం శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా వుంటారనే విషయం అందరికీ తెలిసినదే.

ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి రెక్కలు కట్టుకుని వాలిపోతారు.ఓ రకంగా చెప్పాలంటే వారు చాలా కఠినమైన డ్యూటీ చేస్తూ వుంటారు.

అయినా కూడా కొంతమంది ఏమాత్రం విసుగు చెందక వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే కష్టాల్లో వున్న ప్రాణులకు కూడా సాయం చేస్తూ వుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులో ఉన్న మంచి మనసు బయటపడింది.ఇక ప్రాణాలు పోతాయేమోనని అంతా అనుకుంటున్న సమయంలో ట్రాఫిక్ పోలీసు చేసిన సాహసం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో( Jaipur ) ఒక రహదారికి పైన పదులకొద్దీ కరెంట్ తీగలు( Current wires ) ఉన్నాయి.

పావురం అటుగా ఎగురుతూ వెళ్లడం వలన కాలికి కొన్ని తీగలు చిక్కుకుని గిలగిలా కొట్టుకోసాగింది.

దాని కష్టాన్ని గుర్తించిన ఓ ట్రాఫిక్ పోలీసు అక్కడికి వచ్చి, ట్రాఫిక్ ని క్లియర్ చేసి దానిని కాపాడతాడు.ఈ సంఘటన మొత్తాన్ని అక్కడ వున్నవారు వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.సదరు వీడియోని ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ అకౌంట్ ‘సుప్రియ సాహు ఐఏయస్’ ద్వారా షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన పలువురు పోలీసాఫీసర్ ను ప్రశంసిస్తున్నారు.ఇలాంటి మంచి పోలీసులు ఉండబట్టే ప్రజలు, మూగజీవులు కాస్తయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube