షాకింగ్ న్యూస్: మన భూమి బద్దలుకానుందా?

కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన భౌగోళిక మార్పుల వలనే ఇప్పుడు మనం భూమిమీద సురక్షంగా బ్రతుకు కొనసాగిస్తున్నాం అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే వేల సంవత్సరాల్లో జరగబోయే సంఘటనలను గురించి తలుచుకుంటే పెను విధ్వంసం జరగనుందేమోనాన్న అనుమానం తలెత్తక మానదు.

 Shocking News: Is Our Earth Shattered , Earth, Earth News, Latest News, Destruct-TeluguStop.com

అవును, ఇప్పుడు వరకు 7 ఖండాలుగా ఉన్న ఈ భూమి పై ఎనిమిదో ఖండం ఒకటి తయారు కానుందట.అలాగే మరో కొత్త సముద్రం కూడా ఆవిర్భవిస్తుందని అంటున్నారు భూగర్భ పరిశోధకులు.

భూగోళంలో జరిగే నిరంతర మార్పులు కారణంగా వేల సంవత్సరాల తరువాత ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో భారీ మార్పే చోటుచేసుకోబోతుందని చెప్తున్నారు.

అంటే, రాబోయే సంవత్సరాల్లో ఆఫ్రికా ఖండం రెండుగా చీలి రెండు ఖండాలుగా ఉద్భవిస్తుందని చెప్తున్నారు.ఈ క్రమంలోనే వీటి మధ్య కొత్తగా ఒక సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.ఇకపోతే భూగర్భంలోని ఒక పలక టెక్టోనిక్ ప్లేట్ రెండుగా విడిపోవడాన్ని భూగర్భ శాస్త్రవేత్త( Earth )లు చీలికగా పరిగణిస్తారు.ఈ పలకలు కదలడం మొదలైనప్పుడు పగుళ్లు అనేవి భూగర్భంలోనూ, ఇంకా భూఉపరితలం పైన కూడా ఏర్పడవచ్చు.138 మిలియన్ సంవత్సరాల క్రిందట ఇలాంటి పరిణామం వల్లనే దక్షిణ అమెరికా ఇంకా ఆఫ్రికా 2 ఖండాలుగా( Africa ) విడిపోయాయనే విషయం తెలిసినదే.

ఇప్పుడు అలాంటి మార్పులే ఆఫ్రికా ఖండంలో కనిపిస్తున్నాయి.2005లో ఇధియోపియా ఎడారిలో 506 కిలోమీటర్ల పొడవున భారీ పగులు సంభవించింది.అదే విధంగా 2018లో కెన్యా( Kenya )లోనూ ఇలాంటిదే భారీ పగులు ఒకటి కనిపించింది.సముద్రం కింది అడుగుభాగంలో పలకల కదలికల కారణం వల్ల ఇది సంభవించింది అని పరిశోధకులు నిర్దారించారు.

ఆఫ్రికా సుబియన్, ఆఫ్రికా సోమాలి, అరేబియన్ అనే పలకల పగుళ్ళను శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి సంకేతంగా భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube