ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.అనంతరం ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని సుధాకర్ బాబు నెట్టేశారు.
ఈ క్రమంలో స్పీకర్ పోడియం దగ్గర వీరాంజనేయ స్వామి కిందపడ్డారు.మరోవైపు బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డు లాక్కుని వెనక్కి నెట్టారు వెల్లంపల్లి శ్రీనివాస్.
దీంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు కింద కూర్చుని నిరసనకు దిగారు.ఈ క్రమంలో అసెంబ్లీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







