బోడుప్పల్ లో తమ భూములను కాపాడుకోవడం కోసం ఆమరణ నిరాహార దీక్ష

వక్ఫ్ బోర్డ్ భూములంటూ అన్యాయంగా తమ భూముల రిజిస్ట్రేషన్, అనుమతులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ బోడుప్పల్ లో వక్ఫ్ బాధితుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష…బాధితులకు సంగీబావం ప్రకటించి దీక్షలో పాల్గొన్న టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంత రావు,కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్, మహిళా కాంగ్రెస్ నేత వరలక్ష్మి తదితరులు.

 To Protect Their Lands In Boduppal, Boduppal , Lands , Jagga Reddy ,v. Hanumant-TeluguStop.com

జగ్గారెడ్డి, ఎమ్మెల్యే 40 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న 7000 మంది కుటుంబాల రిజిస్ట్రేషన్ లు ఆపడం దుర్మార్గం.

నాలుగేళ్ల నుండి ఎంఐఎం నాయకులను సంతోషపెట్టడం కోసం కెసిఆర్ ఇంత మంది ప్రజలను ఇబ్బందులు పెడుతున్నడు.హెచ్ ఎం డీ ఏ పరిధిలోని లేఔట్లు ఘట్ కేసర్, బోడుప్పల్ పరిసర 28 కాలనీల పట్టా భూములను వక్ఫ్ బోర్డ్ భూములనడం న్యాయమేనా?.ప్రభుత్వ నిర్ణయం తోటి వేల కుటుంబాలు ఘట్కేసర్, బోడుప్పల్ పరిధిలోని ప్రజలు రోడ్డున పడుతున్నారు.2018 నుండి అత్యవసరాలకు కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు లేకుండా ఇబ్బంది పెడుతుండ్రు.ముఖ్యమంత్రికి లేఖ రాస్తా 40 ఏళ్లలో లేని సమస్యను నాలుగేళ్లలో ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి.కాలనీవాసులను ఇబ్బందులకుగురి చేసే చర్యలను వెనక్కి తీసుకోవాలి.తక్షణం రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలి…

7000 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.వి హనుమంతరావు, మాజీ రాజ్యసభ సభ్యులు 40 సంవత్సరాల క్రితమే ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేవారు… తాత ముత్తాతల నుండి అందరికీ పట్టా కాగితాలు ఉన్నాయి.

ఇల్లు కట్టుకున్నారు.రిజిస్ట్రేషన్ లకు పర్మిషన్లు ఇచ్చారు.

ఈ ప్రాంత ప్రజలు ఇంటి పన్ను, వివిధ పన్నులు కడతా ఉన్నరు.గత కొన్నేళ్ల నుండి ప్రభుత్వాల నుండి కూడా అన్ని సహాయ సహకారాలు అందుతా ఉన్నాయి.

అత్యవసరాలకు ఆస్తులు నమ్ముకుంటా ఉంటే అడ్డుకోవడం దుర్మార్గం… కొత్తగా ఇప్పుడు వక్ఫ్ భూములనడం రిజిస్ట్రేషన్లుఆపడం మంచిది కాదు.ఇన్నేళ్ల నుండి ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదు.ఈ ప్రాంత మంత్రి ఏం చేస్తా ఉన్నడు.7000 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube