మోహన్ బాబు గారిది వేదాంతమా? వైరాగ్యమా?

రెండిటికీ తేడా ఏమిటి అనుకుంటున్నారా? అన్ని అనుభవించామన్న సంతృప్తిలోంచి వచ్చేది వేదాంతం.ఏమీ దక్కలేదు అన్న నిరాశలోంచి వచ్చేది వైరాగ్యం.

 Mohan Babu's Vedanta Disappointment, Mohanbabu , Political , Modi , Jagan,  Chan-TeluguStop.com

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) గారి పుట్టినరోజు ఈరోజు.ఒక నటుడుగా ,నిర్మాతగా ఎంటర్ప్రైన్యూర్ గా ఆయన చాలా విజయల సాధించారు.

టాలీవుడ్ కి సంబంధించిన గొప్ప నటులు లిస్టు తీస్తే ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది.విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మోహన్ బాబు తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో చాలా సినిమాలకు ప్రాణం పోసారని చెప్పవచ్చు.

అయితే ఆయన లెగిసిని కంటిన్యూ చేసే స్థాయిలో ఆయన వారసులు విజయంతో కాకపోవటం ఆయనకి కొంత అసంతృప్తిని మిగిల్చిందని చెప్తారు.విష్ణు ఆయన విద్యాసంస్థలను విజయవంతంగా నడపగలుగుతున్నా సినిమాలు వరకు మోహన్ బాబు పేరు నిలబెట్టే స్థాయి సినిమాలు ఇంతవరకు ఆయన కొడుకులు గాని కూతురు గాని చేయలేకపోయారు.

కొడుకులతో పోలిస్తే కుమార్తె మంచు లక్ష్మి( Manchu Lakshmi ) విభిన్న సినిమాలు ప్రయత్నించి ప్రతిభావంతురాలుగా గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Chandrababu, Jagan, Manchu Lakshmi, Modi, Mohanbabu-Telugu Political News

72వ పుట్టినరోజు సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన జీవిత విశేషాలు చాలా పంచుకున్నారు.జీవితంలో చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని తెలిపి న ఆయన పగవాడికి కూడా ఈ కష్టాలు రాకూడదంటూ కోరుకున్నారు.మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది .రాజకీయాలు క్షుద్ర మైనవి నీచమైనవి అంటూ విమర్శించిన మోహన్ బాబు తన లాంటి ముక్కుసూటి వ్యక్తి అక్కడ మనుగడ సాధించడం కష్టం అని తేల్చేశారు.వైసీపీకి గడిచిన ఎన్నికలలో ప్రచారం చేయడంపై స్పందించిన ఆయన కేవలం బంధుత్వం కారణంగానే మద్దతు ఇచ్చాం తప్ప పదవులు ఆశించి కాదని, తను పదవుల ఆశించి పనిచేసే మనిషిని కాదంటూ చెప్పుకొచ్చారు.

కేంద్రంలో మోడీ నాకు నచ్చిన నాయకుడని అందుకే ఆయన్ని చాలాసార్లు కుటుంబ సమేతంగా వెళ్లి కలిసి వచ్చామని , ఆయన లాంటి నాయకుడు ఉంటే దేశం ముందుకు వెళ్తుందని నమ్ముతున్నాను అంటూ చెప్పారు.తను రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదని కుండబద్దలు కొట్టారు.

ఎన్టీఆర్ హయాంలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు గారు, టిడిపి హయాంలో కొంతవరకు మంచి సంబంధాలు నడిపిన ఆ తర్వాత ఇద్దరికీ చెడింది.ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించి ఎన్నికల్లో ప్రచారం చేసినా ఆ తర్వాత పార్టీ పదవులు లో గాని ప్రభుత్వ పదవుల్లో గాని ఆయనకు మొండిచేయ్యి ఎదురైంది దాంతో రాజకీయాలపై పూర్తిస్థాయిలో విరక్తి చెందారని ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుందంటూ విశ్లేషన్లో కనబడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube