టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది.మెగా హీరోలు ఏ సినిమాలో నటించినా రికార్డ్ రేంజ్ లో కలెక్షన్లు వస్తుండటంతో పాటు ప్రేక్షకులను ఆ సినిమాలు అంచనాలకు మించి ఆకట్టుకుంటున్నాయి.
చిరంజీవి, చరణ్, పవన్ కళ్యాణ్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.అయితే మెగా ఫ్యామిలీకి చెందిన శ్రీజ కళ్యాణ్ దేవ్ ( Sreeja Kalyan Dev ) విడిపోయారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే నిహారిక చైతన్య ( Niharika Chaitanya ) మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో చైతన్యను అన్ ఫాలో చేయడం, అదే సమయంలో చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో కావడంతో పాటు పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి.
అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ జంట విడిపోకూడదని కోరుకుంటున్నారు.
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సాధారణం అని వాటిని భూతద్దంలో పెట్టి చూడవద్దంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.గత కొంతకాలంగా నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం లేదనే సంగతి తెలిసిందే.నిహారిక చైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకోగా ప్రేమించి పెద్దలను ఒప్పించి వీళ్లిద్దరూ వివాహం చేసుకోవడం గమనార్హం.
చైతన్య నిహారిక పెళ్లి కూడా గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.నిహారిక హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టినా హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.పలు వెబ్ సిరీస్ ( Web series ) లను నిర్మిస్తూ నిహారిక కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.నిహారికకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
నిహారిక చైతన్య ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.