ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయండి

సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా :కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 న పార్లమెంట్ ముగింపు సమావేశాల సందర్భంగా మద్దూర్ , కిసాన్ సంఘర్ష్ ర్యాలీ పేరుతో చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ లను ఆదివారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల కమిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య , రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత అశోక్ లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా భారత రాజ్యాంగ పరిధిలోని కార్మిక , రైతు , ప్రజా సంక్షేమానికి సంబంధించిన చట్టాలను బడా పెట్టుబడిదారులకు , కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ కార్మికులకు , రైతులకు సంకెళ్లు విధిస్తూ హక్కులను హరిస్తూ కట్టు బానిసలుగా మారుస్తుందని మండిపడ్డారు.

 Make Delhi Event A Success On April 5th , Delhi , Gunneram Narsaiya, Muktikanta-TeluguStop.com

అలాగే దేశంలో అనేక సంవత్సరాల నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు , కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అప్పజెప్పుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలను మంటగలుగుతుందని,దేశంలో ఒకవైపు పేదల సంక్షేమ పథకాలకు నిధులను తగ్గిస్తూ మరోవైపు పెట్టుబడిదారులు , కార్పొరేట్ల రుణాలను మాఫీ చేస్తూ , వడ్డీలను తగ్గిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన పాలన కొనసాగిస్తుందన్నారు.దేశంలోనీ పేదల సంక్షేమానికి కృషి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు , పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై భారాలు మోపుతోందని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అన్నారు.

ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించడం జరిగిందని కావున కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5 వ.తేదీన దేశంలోని కార్మిక వర్గం , రైతులు , వ్యవసాయ కార్మికులు దాదాపు 10 లక్షల మందితో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.కార్మిక కర్షక ఐక్యతతో చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఛలో ఢిల్లీ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు , రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ కార్యక్రమం విజయవంతం కోసం జిల్లాలోని కార్మిక , రైతు శ్రేయోభిలాషులు , ఉద్యోగ ఉపాధ్యాయులు , మేధావులు , వాణిజ్య వ్యాపారస్తులు , ప్రజాప్రతినిధులు , ప్రజానీకం అందరూ తమ వంతు మద్దతు తెలిపి తోడ్పాటు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలకబాబు , ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ , సిఐటియు నాయకులు మోర అజయ్ , అన్నల్దాస్ గణేష్ , గురజాల శ్రీధర్ , గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube