సాధారణంగా స్టార్ హీరోల కొడుకులు ఒకింత గర్వంతో ఉంటారని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే రామ్ చరణ్( Ram charan ) మాత్రం ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రశంసలను అందుకోవడంతో పాటు విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
ఒదిగి ఉండటానికి ఇష్టపడే రామ్ చరణ్ సాయంత్రం అయితే నేను లుంగీలోనే కనిపిస్తానంటూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
తెల్ల లుంగీ ధరించడం అంటే తనకు ఎంతో ఇష్టమని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సుకుమార్ రంగస్థలం మూవీ కథ చెప్పిన సమయంలో నేను లుంగీలో ఉన్నానని రామ్ చరణ్ అన్నారు.ఈ విషయం తెలిసి రంగస్థలంలో సుకుమార్ నన్ను ఎక్కువగా లుంగీలలో చూపించారని చరణ్ చెప్పుకొచ్చారు.
సోదరి సుస్మిత నాకోసం వేర్వేరు లుంగీలను డిజైన్ చేసిందని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.

లుంగీలతో పాటు లుంగీలకు మ్యాచింగ్ గా ఉండే తువ్వాళ్లను కూడా సోదరి డిజైన్ చేసిందని చరణ్ పేర్కొన్నారు.రంగస్థలంలో నేను వాడిన డ్రెస్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని రామ్ చరణ్ అన్నారు.చరణ్ కెరీర్ పరంగా ప్రస్తుతం ఆస్కార్ సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారని తెలుస్తోంది.
హాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.

లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో చరణ్ నటించాల్సిన సినిమా బన్నీ చేతికి వెళ్లిందని తెలుస్తోంది.ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ ఏడాది చరణ్ సినిమాలేవీ థియేటర్లలో విడుదల కావని తెలుస్తోంది.
ఈ కాలం అబ్బాయిలతో తనను పోల్చవద్దని చరణ్ అన్నారు.రామ్ చరణ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







