గర్భ నిరోధక మాత్రలపై నిషేధం.. తొలి అమెరికన్ రాష్ట్రంగా వ్యోమింగ్ ఘనత

గర్భస్రావం కోసం అసురక్ష పద్ధతులు అనుసరించడం వల్ల స్త్రీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్న సంగతి తెలిసిందే.ఎంతోమంది నిపుణులు, మహిళా సంఘాలు ఈ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

 Wyoming Is The First Us State To Outlaw Abortion Pills Details, Wyoming , Us Sta-TeluguStop.com

ఇకపోతే.అబార్షన్ హక్కుల కోసం అమెరికాలో ( America ) పెద్ద ఎత్తున మహిళా లోకం రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.

గడిచిన యాభై ఏళ్లుగా అగ్రరాజ్యంలో మహిళలు అనుభవిస్తున్న అబార్షన్ ( Abortion ) హక్కు రద్దవ్వడమే అందుకు కారణం.కన్జర్వేటివ్ న్యాయమూర్తులు అబార్షన్ చట్టాన్ని రద్దు చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

అయితే రిపబ్లికన్ జడ్జీల మెజారిటీ వున్న సుప్రీంకోర్టు నుంచి ఈ విషయమై వెలువరించాల్సిన తీర్పు పత్రాలు లీక్ కావడం గతేడాది అమెరికాలో సంచలనం సృష్టించింది.

Telugu Pills, America, Georgia, Governor Jordan, Outlaw Pills, Supreme-Telugu NR

తాజాగా అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రం( Wyoming state ) చరిత్ర సృష్టించింది.రాష్ట్రంలో అబార్షన్ మాత్రలను నిషేధించిన తొలి అమెరికన్ స్టేట్‌గా నిలిచింది.ఈ మేరకు శుక్రవారం రాత్రి వ్యోమింగ్ గవర్నర్ అబార్షన్ మాత్రలను నిషేధించే బిల్లుపై సంతకం చేశారు.

‘‘లైఫ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్ యాక్ట్’’ అని పిలిచే ఈ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆరు నెలలు జైలు శిక్షతో పాటు 9,000 డాలర్ల జరిమానా విధిస్తారు.ఈ చట్టం ద్వారా వ్యోమింగ్‌లో అబార్షన్ సమస్యను పరిష్కరిస్తామని గవర్నర్ జోర్డాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే వ్యోమింగ్ ఏసీఎల్‌యూ అడ్వొకసి డైరెక్టర్ ఆంటోనియో సెరెనో మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని విమర్శించారు.ఒక వ్యక్తి ఆరోగ్యం కంటే రాజకీయాలు ముఖ్యం కాదని.కీలకమైన వైద్య పరమైన నిర్ణయాలకు మార్గనిర్దేశనం చేయాలన్నారు.

Telugu Pills, America, Georgia, Governor Jordan, Outlaw Pills, Supreme-Telugu NR

గతేడాది జూన్‌లో అమెరికా సుప్రీంకోర్ట్ ‘‘రోయ్ వర్సెస్ వేడ్‌’’ను రద్దు చేస్తూ చారిత్రాత్మక తీర్పు చెప్పింది.దాదాపు ఐదు దశాబ్ధాల పాటు అబార్షన్ హక్కును పరిరక్షించిన ఈ తీర్పును ధర్మాసనం రద్దు చేయడంతో అగ్రరాజ్యంలో మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది.అబార్షన్ ఆంక్షలు రాష్ట్రాల పరిధిలోనివని కోర్ట్ స్పష్టం చేసింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు పదమూడు రాష్ట్రాలు అబార్షన్‌పై నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.అయితే జార్జియా మాత్రం పిండం కార్డియాక్ యాక్టివిటీని గుర్తించిన తర్వాత లేదా ఆరు వారాల సమయంలోపు అబార్షన్‌ను నిషేధించింది.

అటు ఇదాహో కోర్టులు మాత్రం వైద్య పరమైన అత్యవసర పరిస్ధితుల్లో అబార్షన్‌ను అనుమతించాల్సిందిగా రాష్ట్ర యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube