పట్టా బద్రుల( Patta Badrula ) ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ పార్టీ అభ్యర్థులు తిరుగులేని విజయాలు సాధించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన చాలా ఎన్నికలలో వైసీపీ గెలవడం జరిగింది.
ఇటువంటి పరిస్థితులలో టీడీపీ( TDP ) పని అయిపోయింది అని కామెంట్లు వస్తున్న క్రమంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఊహించని విధంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది.ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాలలో టీడీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది.

దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో అక్రమాలు జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తుంది.ఈ క్రమంలో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రీ కౌంటింగ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాసింది.వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని.
వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు.ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.







