మైనర్ బాలికపై అత్యాచారం.. ఛాతీపై బ్లేడుతో పేరు.. అసభ్యకర వీడియోలతో బ్లాక్ మెయిల్..!

కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులకు వావి వరసలు లేవు.సాటి మనిషికి ఉండాల్సిన మానవత్వం అసలుకే లేదు.

 Rape Of Minor Girl Name With Blade On Chest Blackmail With Obscene Videos , Aman-TeluguStop.com

కొంతకాలంగా ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడడంతో పాటు, ఆ అమ్మాయి ఛాతీపై బ్లేడుతో పేరు రాసి, లక్షల్లో ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లాక్కున్నాడు.ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని కాన్పూర్ లోని గ్వాల్టోలి ప్రాంతంలో ఒక కామాంధుడు అదే ప్రాంతంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు.

ఇక ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు ఛాతీపై బ్లేడుతో పేరు రాశాడు.అసభ్యకర వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంటి నుండి డబ్బులు తీసుకోవాలని బెదిరిస్తూ, తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.

ఆ కామాంధుడికి భయపడిన బాలిక తన అక్క పెళ్లి కోసం తండ్రి దాచిన పదిన్నర లక్షల రూపాయలను తీసుకెళ్లి ఆ నీచుడు చేతిలో పెట్టింది.కొంతకాలం తర్వాత తన అక్కకు పెళ్లి కుదిరి, పెళ్లి పనుల కోసం డబ్బు తీద్దామని తండ్రి అల్మరా తెరిచి చూస్తే అక్కడ డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.తండ్రి ఇంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ బాలికను కూడా గట్టిగా నిలదీయడంతో ఆ కామాంధుడి బండారం బట్టబయలు అయింది.తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్లో ఆ కామాంధుడిపై ఫిర్యాదు చేశాడు.

పోలీసులు ఆ బాలికను జరిగిన విషయం గురించి ఆరా తీయగా ప్రేమ పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడుతూ తనను బ్లాక్ మెయిల్ చేయడంతో ఇంట్లో డబ్బులు దొంగిలించి అమన్ అనే వ్యక్తికి ఇచ్చినట్లు చెప్పింది.అంతేకాకుండా తల్లి మంగళ సూత్రాన్ని కూడా దొంగిలించి అమన్( Aman ) కు ఇచ్చానని, ఇందులో అమన్ స్నేహితుల పాత్ర కూడా ఉందని, తనను వీడియోలు తీసి బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాక ఇలా ఇంట్లో దొంగతనం చేసి వారి చేతిలో పెడుతున్నానని పేర్కొంది.

పోలీసులు అమన్, అతని స్నేహితులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అమన్ కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube