కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఎండపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది.
గ్రామానికి చెందిన తాటాకిల్లు మంటలకు దగ్ధమైంది.మంటలు చెలరేగిన సమయంలోనే ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
ఈ క్రమంలో సిలిండర్ పేలిన శబ్ధానికి భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు.అయితే మహిళ అప్రమత్తంగా వ్యవహారించడంతో ప్రాణనష్టం తప్పింది.
పొగ కనిపించిన వెంటనే ఇంట్లోకి వెళ్లిన మహిళ బాబును బయటకు తీసుకువచ్చింది.మంటల్లో ఇల్లు పూర్తిగా కాలి బూడిదవగా ఇంట్లో ఉన్న రూ.5 లక్షల నగదు కూడా దగ్ధమయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.