నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే-టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతే రాజిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్న పట్టించుకోరా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ విషయం నుండి రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికే పేపర్ లీకేజీ వ్యవహారం అని అన్నారు.

 Unemployed Naveen's Suicide Is A Government Murder-tnsf Leaders Mote Rajireddy,-TeluguStop.com

సిరిసిల్లకు చెందిన నవీన్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని,పేపర్ లికేజీకి సంబంధించి బాధ్యత వహించి బీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేయాలని నవీన్ ఆత్మహత్యపై భగ్గుమన్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి.నవీన్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఉద్యగాలు వస్తాయని గంపేడాశలు పెట్టుకున్న నిరుద్యోగుల ఉసురు తిస్తుర్రు ,ఈ చావుకు ఎవరు బాధ్యులు ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు కావా, తెలంగాణ బిడ్డలకు లక్షల ఉద్యోగాలు ఇచ్చినం తెలంగాణ యువత మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా వచ్చి తెలంగాణలోని ఉపాధి పొందుతున్నారని గొప్పలు పలికే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో ఈరోజు ఉద్యోగం లేక ఉపాధి కరువై ఎట్లా బతకాల్లో తెలవక ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

దీనికి ఏం సమాధానం చెప్తారు.

పేపర్ లీకేజీల వ్యవహారంలో బీఆర్ఎస్ మంత్రుల పాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లనే పేపర్ లికేజ్.

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల ఉసురు కల్వకుంట్ల కుటుంబానికి తప్పక తగులుతుందన్నారు.మీ ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చుకొని రాష్ట్ర నిరుద్యోగుల ఉసురు తిస్తున్నా ఘనత మీది కాదా,రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ అయితేనే ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు అసలైన ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు.

నిరుద్యోగుల పక్షాన తెలుగుదేశం పార్టీ, టిఎన్ఎస్ఎఫ్ అండగా ఉండి పోరాటం చేస్తుంది అని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube