తన హార్డ్ కోర్ ఫ్యాన్ సైతం షాక్ అయ్యేలా చేసిన ఎన్టీఆర్.. యంగ్ టైగర్ అంటే ఆ మాత్రం ఉండాలిగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు ఫాలోయింగ్ ఏ లెవల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో అయితే గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.

 Ntr Hardcore Fan Vishwak Sen Dhamki Pre-release Event Details, Dhamki Pre-releas-TeluguStop.com

ఇటీవలే ఇండియాకు ఆస్కార్ కూడా తేవడంతో ఈయన మరింత పాపులర్ అయ్యాడు.ఇక ఎన్టీఆర్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో కొరటాల శివ సినిమా ఒకటి.

ఈ సినిమా ఇప్పటికే ప్రకటించి ఏడాది కావొస్తుంది.ఇప్పటి వరకు వచ్చిన ఆలస్యం ఇకపై జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ ఆస్కార్ (oscar) ఈవెంట్ ముగించుకుని ఇండియాకు రాగానే తన అభిమాని అయిన విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేశాడు.విశ్వక్ సేన్( Vishwak sen ) హీరోగా నటించి తెరకెక్కించిన ధమ్కీ సినిమా మార్చి 22న రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే నిన్న రాత్రి గ్రాండ్ గా ధమ్కీ (Dhamki) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపారు.

ఈ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ ఆ స్టేజ్ మీద చేసిన స్పీచ్ నెట్టింట వైరల్ అయ్యింది.ముఖ్యంగా తన హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి విశ్వక్ సేన్ సినిమాల లిస్ట్ మొత్తం చెప్పి ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడు.విశ్వక్ సేన్ నటించిన ప్రతీ సినిమాను విడమరిచి మరీ ఆ సినిమాల్లో విశ్వక్ చేసిన పాత్ర గురించి కూడా తారక్ చెప్పడం షాకింగ్ అనే చెప్పాలి.

ఎన్టీఆర్ తన సినిమాలను ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు చూడడం వాటి కోసం మాట్లాడడం అనేది ఈ హీరోను ఎక్కడో నిలబెట్టేలా చేస్తుంది.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాలను చూడడానికి ఫ్యాన్స్ అంతా పరితపిస్తూ ఉంటారు.అలాంటిది ఎన్టీఆర్ నే విశ్వక్ సేన్ సినిమాల గురించి ఆయన నటన గురించి చెప్పడం ఎన్టీఆర్ గొప్పదనంగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.ఎంతైనా ఎన్టీఆర్ అంటే అలానే ఉంటుంది మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube