కమెడియన్ గా అందరికీ ఎంతో పరిచయమై తన పర్ఫామెన్స్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వేణు (Venu) అనంతరం దర్శకుడిగా మారిన విషయం మనకు తెలిసిందే.ఇలా దర్శకుడిగా మారిన ఈయన బలగం(Balagam) సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీల నుంచి ఈయన ప్రశంసలు అందుకుంటున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వేణు మరికొన్ని అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
ఇలా డైరెక్టర్ గా సక్సెస్ అయినటువంటి ఈయన ఎంతో మానవత్వం కలిగి ఉన్నారని మరోసారి నిరూపించుకున్నారు.
బలగం సినిమా క్లైమాక్స్ లో తమ బుర్రకథతో అందరి హృదయాలను కదిలించారు కొమురవ్వ, మొగిలయ్య.
అయితే తాజాగా మొగిలయ్య( Mogilayya) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వేణు దృష్టికి వెళ్ళింది.మొగిలయ్య కిడ్నీలు పాడవడంతో ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిసి ఈయన తన వంతు సహాయంగా మొగిలయ్యకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
ఈ క్రమంలోని వేణు వారి స్వగ్రామానికి వెళ్లి లక్ష రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వారిని సన్మానించారు.

అనంతరం వేణు వారికి భరోసా కల్పిస్తూ నిర్మాత దిల్ రాజు(Dil Raju) మరింత ఆర్థిక సహాయం అందేలా చూస్తానన్నారని తెలిపారు.ఈ విధంగా మొగిలయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలియగానే వెంటనే స్పందించిన వేణు ఇలా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో ఈయన మంచి మనసుపై నేటిజన్స్ ప్రశంసలు కురపిస్తున్నారు.ఇక ఈయనతో పాటు బలగం సినిమాకు సంబంధించినటువంటి పలువురు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్స్ వేణు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.







