అల్లం సాగులో చీడపీడల బెడద.. యాజమాన్య పద్ధతులు..!

అల్లం సాగును( Ginger cultivation ) నీరు నిల్వ ఉండని, ఇసుక శాతం ఎక్కువగా ఉండే ఎలాంటి నేలలైన అనుకూలంగా ఉంటాయి.అల్లం ను తేమతో కూడిన వాతావరణం చాలా అనుకూలం.

 The Problem Of Pests In Ginger Cultivation.. Proprietary Methods , Ginger Cultiv-TeluguStop.com

అంతర పంటగా అల్లం సాగు చేసి మంచి దిగుబడి పొందవచ్చు.

అల్లం సాగుకు చీడపీడలు తొలిదశ నుండి చివరి దశ వరకు ఎక్కువగా ఆశిస్తాయి.

కాబట్టి విత్తనాలను సరైన పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవాలి.అల్లం సాగులో చేయవలసిన సంరక్షణ పద్ధతులు ఏమిటో చూద్దాం.

దుంపకుళ్ళు తెగులు:

అల్లంకు ఈ తెగులు సోకితే అంటే పంటలో దాదాపు 20 క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది.నీటి ఎద్దడి సమస్యలు తలెత్తితే ఈ తెగులు పంటను ఆశిస్తుంది.

అలాగే నీరు నిల్వ ఉన్న, వర్షపాతం ఎక్కువగా ఉన్న ఈ తెగుళ్లు సోకే అవకాశం ఉంది.వీటి ఉధృతి పెరిగినప్పుడు మొక్కలు ఎండిపోయి, దుంపలు కుళ్లిపోతాయి.

Telugu Agriculture, Formers, Ginger, Latest Telugu, Neem Powder-Latest News - Te

నివారణ కోసం పశువుల ఎరువులతో పాటు వేప పిండి ( Neem powder )కలిపి వేసుకోవాలి.ఈ తెగులు పంటను ఆశించినప్పుడు లీటరు నీటిలో ఐదు గ్రాముల మంకోజెబ్ కలిపి మొక్కల పాదులను తడపాలి.ఇంకా ఉధృతి తగ్గకుంటే లీటరు నీటిలో కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రాములు, ట్రైకోడెర్మా ఐదు గ్రాములు వేప పిండి కలిపి మొక్క పాదుల చుట్టూ వేయడం వల్ల వీటిని నివారించవచ్చు.

Telugu Agriculture, Formers, Ginger, Latest Telugu, Neem Powder-Latest News - Te

ఆకుమాడు తెగులు:

నేలను తాకే ఆకులకు భూమిలోనుండి ఈ తెగులు సోకి గోధుమ రంగులోకి మారతాయి.తర్వాత ఇతర ఆకులకు వ్యాప్తి చెంది తొడిమలు మాడిపోతాయి.డీటరు నీటిలో ఒక మిల్లీలీటర్ ప్రాపికొనజోల్ కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Formers, Ginger, Latest Telugu, Neem Powder-Latest News - Te

మొవ్వ తొలచు పురుగు:

పురుగులు పంటను ఆశించి మొవ్వను తొలిచి పూర్తిగా తినేయడంతో మొక్క చనిపోతుంది.వీటి నివారణకు లీటరు నీటిలో క్వినాల్ ఫాస్ 2 మి.లీ * సాండోవిట్ 1 మి.లీ కలిపి పిచికారి చేయాలి.

పొలుసు పురుగు:

ఈ పురుగులు దుంపల రసాన్ని పీల్చేసి, పంటకు తీరు నష్టం కలిగిస్తాయి.వీటి నివారణ కోసం లీటర్ నీటిలో మలాథాయాన్ ఐదు మి.లీ కలిపి, ఈ ద్రావణంలో విత్తన దుంపలను ఒక అరగంట నానబెట్టి ఆ తర్వాత ఎత్తుకోవాలి.

పైన చెప్పిన సంరక్షణ చర్యలు తప్పక పాటిస్తే చీడపీడల బెడద సమర్థవంతంగా అరికట్టబడి ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube