మామూలుగా కొన్ని కొన్ని సార్లు కొందరు అచ్చం మరో వ్యక్తిలా కనిపిస్తూ ఉంటారు.అలా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కొన్ని కొన్ని సార్లు వేరే హీరోయిన్ లా కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కొంతమంది హీరోయిన్ లకు దగ్గర పోలికగా కనిపిస్తూ ఉంటారు.అయితే తాజాగా యాంకర్ రష్మీ( Anchor Rashmi ) కూడా ఒక స్టార్ హీరోయిన్ లా ఉంది అంటూ పోలుస్తున్నారు.
ఇంతకు ఎవరి లాగా ఉందో ఒకసారి తెలుసుకుందాం.
బుల్లితెరపై యాంకర్ గా పరిచయమైన రష్మీ గౌతమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టి అందరినీ ఆకట్టుకుంది.మొదట్లో రష్మీ వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టగా ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అడుగు పెట్టింది.
దీంతో రష్మీకి జబర్దస్త్( Jabardasth ) ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది.

ఆమెకు మాత్రం బుల్లితెర పైనే క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు.కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది.గతంలో ఢీ షోలో కూడా టీం లీడర్ గా చేసి బాగా సందడి చేసింది.
ఇక రష్మీ మరో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ తో( Sudigali Sudheer ) గతంలో ఎంతలా రచ్చ చేసిందో చూసాం.వీరిద్దరి మధ్య చనువు చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు.

కానీ వాళ్ళు కేవలం షోస్ వరకు మాత్రమే అలా ప్రవర్తించేవారు అని తెలిసింది.ఇక రష్మీకి జంతువులంటే చాలా ఇష్టం.వాటికి ఏమైనా జరిగితే అసలు తట్టుకోలేదు.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా సమాజంలో జరిగే విషయాలపై బాగా స్పందిస్తుంది.ముఖ్యంగా మూగజీవుల విషయంలో మాత్రం

ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట దేశాలలో సందడి చేస్తుంది.ఇక ఈ మధ్య బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటుంది.
అయితే తాజాగా కొన్ని ఫోటోషూట్లు చేయించుకుంది.అందులో చీర కట్టులో చాలా అందంగా కనిపించింది.
ఇక రకరకాల ఫోజులిస్తూ బాగానే షో చేసింది.
ఇక తన వీపు అందాలతో బాగా రెచ్చగొట్టింది.
చూపులు మాత్రం కుర్రాళ్ళ మదిని గుచ్చుకునేలా ఉన్నాయి.అయితే ఆ ఫోటోలు చూసి తన ఫాన్స్ రకరకాలుగా పొగుడుతున్నారు.
కొంతమంది ఆమె అచ్చం నయనతారల ( Nayantara ) ఉంది అని.నయనతార చెల్లెలు అంటూ ఈ స్టార్ హీరోయిన్ తో పోలుస్తున్నారు.దీంతో మరి కొంతమంది నిజంగా అలాగే ఉంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.







