నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అనుబంధ ఛార్జ్‌షీట్ వేసింది.ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఐదుగురు నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలైంది.
పీఎఫ్ఐ కేసులో నిందితులుగా ఉన్న అబ్దుల్ రహీం, షేక్ వహీద్ అలీ, జప్రుల్లా ఖాన్ పఠాన్, షేక్ రియాజ్ అహ్మద్ తో పాటు అబ్దుల్ వరీస్ పై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.గతంలో పదకొండు మంది పై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్‌షీట్ వేసింది.
ముస్లిం యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు రెచ్చగొడుతున్నారని నిందితులపై ఎన్ఐఏ అభియోగం చేస్తున్న విషయం తెలిసిందే.