బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే అత్యవసర విచారణకు కోరగా ధర్మాసనం నిరాకరించిందన్న వార్తలపై కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు.
పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.ఇంతకముందు చెప్పిన విధంగా ఈనెల 24న పిటిషన్ పై విచారణ జరుగుతుందని వెల్లడించారు.
ఇవాళ కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.







