బాహుబలి, బాహుబలి2 సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి2( Baahubali 2 ) సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించింది.
సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చాయి.
సలార్ మూవీ( Salaar ) షూట్ 80 శాతానికి పైగా పూర్తైందని యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.
మరోవైపు సలార్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని తెలుస్తోంది.సలార్ కొడుకు పాత్ర దేవా అని బోగట్టా.
బాహుబలిలో తండ్రీ కొడుకులలా కనిపించిన విధంగా సలార్ లో కూడా తండ్రీ కొడుకులుగా ప్రభాస్ కనిపించనున్నారని సమాచారం.

జగపతిబాబు( Jagapathi Babu ), పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించనున్నారు. సలార్2 మూవీ షూట్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.ప్రశాంత్ నీల్ స్పందిస్తే మాత్రమే తన తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక మూవీ తెరకెక్కనుంది.

ఈ సినిమాను కూడా స్పెషల్ గా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్లాన్ చేశారని సమాచారం.సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ సినిమాలుగా నిలవడంతో పాటు ప్రభాస్ 200 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగటానికి కారణమవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.సలార్ కొడుకు దేవా పాత్ర గురించి లీక్ కాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు.







