అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్( Joe Biden ) పరిపాలనా యంత్రాంగంలో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా బైడెన్ మాత్రం ఇండో అమెరికన్ల సత్తాపై నమ్మకం వుంచి వారికే అత్యున్నత పదవులు కట్టబెడుతున్నారు.
కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన బైడెన్ మళ్లీ ఇటీవలి కాలంలో భారతీయ అమెరికన్లను కీలకపదవుల్లో నియమిస్తూ వస్తున్నారు.తాజాగా యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా భారత సంతతికి చెందిన రవి చౌదరిని( Ravi Chaudhary ) నామినేట్ చేస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ ఆమోదముద్ర వేసింది.65-29 ఓట్ల తేడాతో సెనేట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది.అంతేకాదు.
రవి చౌదరికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో డజను మందికి పైగా రిపబ్లికన్లు వుండటం విశేషం.యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు( US air force ) సహాయ కార్యదర్శిగా పనిచేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా రవి చౌదరి ఇప్పటికే చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

రవి చౌదరి గతంలో అమెరికా రవాణా శాఖలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.అంతేకాకుండా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)లోని కమర్షియల్ స్పేస్ ఆఫీస్‌లో డైరెక్టర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ అండ్ ఇన్నోవేషన్‌గానూ విధులు నిర్వర్తించారు.ఈ హోదాలో ఎఫ్ఏఏ కమర్షియల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ మిషన్‌కు మద్ధతుగా అధునాతన అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు.రవాణా శాఖలో విధులు నిర్వర్తించే సమయంలో దేశవ్యాప్తంగా వున్న తొమ్మిది ప్రాంతాలలో విమానయాన కార్యకలాపాల ఏకీకరణ కోసం రీజియన్స్ అండ్ సెంటర్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

1993-2015 మధ్య అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో సీ 17 విమాన పైలట్‌గా ఎన్నో మిషన్‌లలో పాలు పంచుకున్నారు రవి చౌదరి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో వున్న జీపీఎస్ అభివృద్ధి , రూపకల్పన విషయంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.ప్రస్తుతం అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో ఇన్‌స్టాలేషన్‌లు , బేసింగ్ స్ట్రాటజీ, అలాగే మిలిటరీ హౌసింగ్ నాణ్యతను నిర్ధారించడం ఇతర కార్యాచరణలకు బాధ్యత వహిస్తారు.







