బీజేపీకి పవన్.. పవర్ పంచ్ !

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని అటు బీజేపీ నేతలుగానీ, ఇటు పవన్( Pawan kalyan ) గాని చాలా సార్లు స్పష్టం చేశారు.

 Pawan's Shock To The Bjp , Pawan Kalyan, Bjp, Janasena , Tdp ,somu Veerraju , Y-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena )తో కలిసి పోటీలో నిలుస్తామని కమలనాథులు ఇప్పటికే ప్రకటించారు.అయితే బీజేపీ( BJP ), జనసేన పొత్తులో ఉన్నాయనే మాటే గాని ఇంతవరు ఈ రెండు పార్టీలు కలిసి ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు.

కలిసి ఎలాంటి కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోలేదు.మరి మిత్రపక్షంగా ఉన్న పార్టీలు ఇంతవరకు కలిసి నడవకపోవడం కొంత ఆశ్చర్యకరమే.

ఎందుకంటే ఎన్నికలు మరో ఏడాదిన్నరలో జరగనున్నాయి.అందువల్ల ఇప్పటికే ఈ రెండు పార్టీలు కలిసి నిత్యం ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితి.

కానీ ప్రస్తుతం సీన్ అలా లేదు.ఈ రెండు పార్టీల ప్రణాళికలు ఎవరికి వారే అన్నట్లుగానే ఉన్నాయి.

Telugu Jsp, Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Somu Veerraju, Ys Jagan, Ys

దీంతో బీజేపీ జనసేన దోస్తీ కేవలం నామ్ కే వాస్తి అనే వాదన నడుస్తోంది.ఎందుకంటే పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.10 వ జనసేన ఆవిర్భావ సభలో ” తాము ప్రస్తుతం బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికి.ముస్లింలపై దాడులకు పాల్పడితే మిత్రపక్షనికి బై బై చెబుతామని హెచ్చరించారు.

అంతే కాకుండా రోడ్ మ్యాప్ విషయంలో కలిసి నడిచేందుకు బీజేపీ ఆగ్రనాయకులతో చాలాసార్లు చర్చించానని, కానీ వల్ల నుంచి సరైన స్పందన లేదని పవన్ చెప్పుకొచ్చారు.పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారా ? అనే సందేహం రాక మానదు.ఒకవేళ పవన్ బీజేపీకి హాండ్ ఇస్తే.కమలం పార్టీకి గట్టి దేబ్బే అని చెప్పుకోవాలి.

Telugu Jsp, Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Somu Veerraju, Ys Jagan, Ys

ఎందుకంటే పవన్ అండతోనే ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి పవన్ తాజా వ్యాఖ్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పవన్ ఎప్పుడు తెగతెంపులు చేసుకుంటారో తెలియక కాషాయ నేతలు తలలు పట్టుకుంటున్నారు.అంతే కాకుండా తాను టిడిపితో కలిసేందుకు సిద్దమే అనే సంకేతాలు కూడా ఇచ్చారు పవన్.దీంతో బీజేపీ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.పవన్ ఒకవేళ టీడీపీతో కలిస్తే.బీజేపీ ఒంటరిపోరుకు సిద్దమౌతుందా ? లేదా అని మర్చిపోయి 2014 కూటమిని రిపీట్ చేస్తుందా అనేది ఆసక్తికర అంశం.బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్ డిజిట్ కూడా రాబట్టడం కష్టమే.మొత్తానికి కమలం పార్టీకి పవన్ ఇచ్చిన పవర్ స్ట్రోక్ గట్టిగానే తగిలింది.మరి కమలం పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube