కుల రాజకీయాలపై జనసేన పవన్ కళ్యాణ్( Pawan kalyan ) మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆవేశంగా మాట్లాడారు.కుల పిచ్చి తోనే ఏపీ అభివృద్ధి కి నోచుకోవడం లేదని పవన్ వ్యాఖ్యానించారు.
ఎక్కడ లేని విధంగా ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని పవన్ మాట్లాడిన మాటలను ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ అంది పుచ్చుకుంది.దేశవ్యాప్తంగా బి ఆర్ ఎస్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోని ఏపీలోనూ గత కొంతకాలంగా బీఆర్ఎస్( BRS ) హడావుడి పెంచింది.
దీనిలో భాగంగానే ఏపీ బీఆర్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను( Thota chandrasekhar ) నియమించింది .అంతేకాదు పెద్ద ఎత్తున చేరికలకు శ్రీకారం చుట్టింది.దీనిలో భాగంగానే తెలంగాణ భవన్ లో నంద్యాల , ప్రకాశం, కర్నూలు , మరికొన్ని జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ తో పాటు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula prasanth reddy ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి కులాల అంశాన్ని లేవనెత్తారు.కుల పిచ్చి రాజకీయాలతో ఏపీ ఆగమైందంటూ వ్యాఖ్యానించారు.గత తొమ్మిది సంవత్సరాలుగా జగన్ , చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని అందుకే ఏపీ అభివృద్ధి సంక్షేమం అడ్రస్ లేకుండా పోయాయి అంటూ ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.చంద్రబాబును, జగన్ ను నమ్మిన ఏపీ ప్రజలకు ఇంకా రాజధాని నిర్ణయం కాలేదన్నారు.ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి కారణం టిడిపి, వైసిపి లేనని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఏపీలో ఎందుకు అభివృద్ధి జరగలేదని మంత్రి ప్రశ్నించారు.

ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని నాయకులు, పాలకుల వల్లే ఏపీ పరిస్థితి ఇలా ఉంది అంటూ మండిపడ్డారు.ఏపీ అధికార పార్టీ, ప్రతిపక్షం రెండు మోది సంకలో చేరాయని అందుకే రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా, ఎవరు నోరు మెలపడం లేదంటూ విమర్శలు చేశారు.కులమతాలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, అందుకే కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.







