స్టార్ నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్( Shruti Haasan ).తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెట్టింది.తనకంటూ అభిమానని సంపాదించుకుంది.
సోషల్ మీడియా లో మాత్రం బాగా యాక్టీవ్ గా ఉంటుంది.ఇక ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’( luck )అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.

తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది కూడా.బాలీవుడ్( Bollywood ) లో కూడా తన పాటను వినిపించింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.
ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా హజారికా తో సహజీవనం చేస్తూ రచ్చ చేస్తుంది.ఇక ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
ఇక శృతిహాసన్ గతంలో తన వ్యక్తిగత విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.దాంతో ఆమె కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మళ్లీ రీఫ్రెష్ అయ్యి మళ్లీ రీఎంట్రీ తో వరుస హిట్టులను సొంతం చేసుకుంది.అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెట్టింది.దీంతో నెటిజన్స్ దొరికిందే ఛాన్స్ అని తెగ ప్రశ్నలు వేశారు.
అలా కొందరు ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి అడగగా.మరి కొంతమంది తనకు ఇష్టమైన ఫుడ్, స్మెల్ గురించి అడిగారు.
అయితే ఓ నెటిజన్ మీరు వర్జినా అని అడిగినట్లు కనిపించారు.అంటే ఆ స్పెల్లింగ్ కాస్త తప్పుగా అనిపించింది.
దీంతో ఆ ప్రశ్నకు శృతి కాస్త కోపంగానే సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.ముందు స్పెల్లింగ్ కరెక్ట్ నేర్చుకో అన్నట్లు సమాధానం ఇచ్చింది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.







